తలపతి ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్ - 'లియో' ఆడియో లాంచ్ రద్దు

Anilkumar
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న తాజా సినిమా లియో. దసరా కానుకగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీం గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు.
సెప్టెంబర్ 30న చెన్నై వేదికగా ఆడియో లాంచ్ జరగాల్సి ఉంది. ఫ్యాన్స్ ఈ వేడుక కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో లియో నిర్మాతలు ఆడియో వేడుకను రద్దు చేస్తున్నామని ప్రకటించి షాక్ ఇచ్చారు. అందుకు పలు కారణాలను కూడా వివరించారు. అంచనాలకు మించి అభిమానుల నుండి స్పందన రావడం, ఆడియో లాంచ్ పాసుల కోసం విపరీతమైన రిక్వెస్ట్ లు రావడంతో, భద్రత కారణాలు, ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా లియో ఆడియో ఈవెంట్ ను


 రద్దు చేస్తున్నామని ఈ సందర్భంగా నిర్మాతలు వివరణ ఇచ్చారు. అయితే ఈ విషయంలో అభిమానులు మాత్రం ఈ ఈవెంట్ రద్దు చేయడం వెనుక రాజకీయ కోణం ఉందని అంటున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఉద్దేశపూర్వకంగానే 'లియో' ఆడియో రద్దు అయ్యేలా చేశాడని, విజయ్ సినిమాను తమిళనాడు ప్రభుత్వం తొక్కేస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. గత కొన్నాళ్లుగా విజయ్ రాజకీయం చేసేందుకు పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు అభిమానులతో సమావేశం అవుతున్నారు విజయ్. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ బరిలోకి దిగడం ఖాయమని చెబుతున్నారు. 


ఇందులో భాగంగానే 'లియో' సినిమాపై ఆంక్షలు విధించడం వెనక అసలు కారణం ఇదే అని ఫ్యాన్స్ చెబుతున్నారు మరికొందరేమో సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కి చెందిన రెడ్ జాయింట్ సంస్థకు లియో మూవీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇవ్వకపోవడంతో, అతనే ఉద్దేశపూర్వకంగా 'లియో' ఆడియో లాంచ్ లేదు రద్దు చేయించారని, ఒకవేళ లియో హక్కులను వాళ్లకే ఇచ్చి ఉంటే ఆడియో లాంచ్ కి రూట్ క్లియర్ చేసేవారని కామెంట్స్ చేస్తున్నారు. మరి వీటిల్లో ఏది వాస్తవమో తెలియదు కానీ చిత్ర నిర్మాతలు మాత్రం వేరే కారణాలతో 'లియో' ఆడియో లాంచ్ ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం దళపతి ఫ్యాన్స్ లో తీవ్ర నిరాశను నింపింది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: