భగవంత్ కేసరి నుంచి బాలయ్య మాస్ వార్నింగ్..!!
ది జర్నీ ఆఫ్ భగవంత్ కేసరి పేరుతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటికీ ముగిసే సమయానికి సెట్ లో జరిగిన మేకింగ్ వీడియోని చిత్ర బృందం షేర్ చేయడం జరిగింది. హై ఎనర్జిటిక్ ట్రిల్లింగ్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్టుగా క్యాప్షన్ రాసుకురావడం జరిగింది. 8 నెలల పాటు 24 అద్భుతమైన లోకేషన్స్ తో 12 భారీ సెట్స్ వేసి ఈ సినిమా షూటింగ్ జరిపినట్లుగా తెలియజేశారు. ఈ చిత్రం కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడినట్లుగా ఈ వీడియోలో చూపించారు. యాక్షన్ సన్నివేశాలు మేకింగ్ వీడియోస్ కూడా అందరిని ఆకట్టుకుంటున్నాయి.
ఇక ఇందులో బాలయ్య చెప్పే డైలాగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పవచ్చు. చివరిలో బాలయ్య డైలాగ్" కలిసి మాట్లాడుతా అన్నా కదా అంతలోనే మందిని పంపాలా గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బె అంటూ చెప్పే బాలయ్య డైలాగ్ విజిల్స్ వినిపించేలా కనిపిస్తున్నాయి". అఖండ వీరసింహారెడ్డి వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలను అందుకున్న బాలయ్య ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటారని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు పోస్టర్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.