నయనతార ఆస్తి ఎంతో తెలిస్తే వామ్మో అనాల్సిందే?

Purushottham Vinay
 దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే నంబర్ వన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగి రెండు దశాబ్ధాల కెరీర్ లో సూపర్ స్టార్ డం చూసింది నయనతార.ఇప్పుడు బాలీవుడ్ నెంబర్ 1 హీరో షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రంతో  నార్త్ లో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే 1000 కోట్ల క్లబ్ నాయిక అయింది. ఒక్కో సినిమాకి  రికార్డ్ స్థాయిలో భారీ పారితోషికం అందుకునే నయన్ ఈ రెండు దశాబ్ధాల కెరీర్ లో ఎంత సంపాదించింది? తన ఆస్తి విలువ ఎంత? ఇప్పుడు తెలుసుకుందాం. నయనతార పూర్తి పేరు డయానా మరియం కురియన్.నయనతార ఆస్తుల విలువ సుమారు 200 కోట్లు ఉంటుందని సమాచారం తెలుస్తుంది. ఇందులో పలు నగరాల్లో సొంత అపార్ట్ మెంట్లు విల్లాలు, స్థలాలు,కార్లు, ప్రయివేట్ జెట్ ఉన్నాయి. నయనతార ఒక్కో సినిమాకి సుమారు 8 కోట్ల పారితోషికం అందుకుంటూ ఏడాదికి మూడు నాలుగు సినిమాల్లో నటిస్తూ 18ఏళ్ల ప్రయాణంలో నయనతార ఇంత పెద్ద ఆస్తిని సంపాదించింది.


ఇంకా వాణిజ్య ప్రకటనల ఆదాయం కూడా ఈమెకి బాగా వస్తుంది. అంతేగాక తనకు కొన్ని ఫిక్స్ డ్ అస్సెట్స్ కూడా ఎంతో విలువైనవి ఉన్నాయి. ఖరీదైన కార్లు ఆమె గ్యారేజీలో ఉన్నాయి.2018 లో మొత్తం రూ .15 కోట్ల సంపాదనతో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 లిస్టులో చోటు దక్కించుకున్న నయన్ గత 17 ఏళ్లలో ఏకంగా 75 కి పైగా చిత్రాల్లో నటించింది. 2003 లో జయరామ్ తో కలిసి మలయాళ సినిమా మనస్సినక్కరేతో ఆమె తొలిసారి హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అగ్ర నాయికగా ఎదిగింది. నయనతార కన్నడలో 'సూపర్' సినిమా తో తొలిసారిగా అడుగుపెట్టింది.ఇది ఆమె ఏకైక శాండల్ వుడ్ చిత్రంగా ఉంది. ప్రతి హిట్ చిత్రంతో అభిమానులని పెంచుకుంటూ పోతుంది నయన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: