స్కంద రివ్యూ: ఆ ఇండస్ట్రీ సినిమా లాగా ఉందే..?

Purushottham Vinay
“అఖండ” లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మరో మాస్ మసాలా ఎంటర్ టైనర్ “స్కంద”నేడు విడుదల అయ్యింది.రామ్ పోతినేని కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమా మొదట సెప్టెంబర్ ప్రధమార్ధంలో విడుదలకు ప్లాన్ చేసినప్పటికీ..“సలార్” సినిమా పోస్ట్ పోన్ తో లాంగ్ వీకెండ్ ఇంకా పబ్లిక్ హాలీడేస్ కోసం సెప్టెంబర్ 28కి షిఫ్ట్ చేశారు.బోయపాటి మార్క్ హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఇంకా పాటలు మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి.బోయపాటి శ్రీను డిజైన్ చేసిన మాస్ క్యారెక్టర్ లో రామ్ కాస్త ఇబ్బందిపడినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ యాసలో మాస్ డైలాగ్స్ చెప్పడానికి చాలా కష్టపడ్డాడు. కానీ మాస్ యాక్షన్ సీన్స్ లో మాత్రం బాగా రఫ్ఫాడించేశాడు. ఆడియన్స్ కి బీహారీ హీరోను చూస్తున్న ఫీల్ కలుగుతుంది. ఆయన స్టైలింగ్ & బాడీ లాంగ్వేజ్ బాగా ఆకట్టుకుంటుంది.అలాగే శ్రీలీల స్క్రీన్ ప్రెజన్స్ ఇంకా క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవడానికి పెద్దగా ఏమీ లేదు కానీ డ్యాన్స్ మాత్రం ఇరగదీసింది.ముఖ్యంగా పబ్ సెట్ లో వేసిన పోల్ డ్యాన్స్ అయితే ఆడియన్స్ కు మంచి కిక్ ఇస్తుంది.


బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ మరీ సైడ్ క్యారెక్టర్ లా మిగిలిపోయింది. సీనియర్ హీరో శ్రీకాంత్ మాత్రం తనకు ఇచ్చిన బాధ్యతాయుతమైన పాత్రకు బాగా న్యాయం చేశాడు.ఇంకా అలాగే మహారాష్ట్ర నటుడు అజయ్ పుర్కార్, కన్నడ నటుడు శరత్ లోహితస్వలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఇమడడానికి విశ్వప్రయత్నం చేశారు.మిగతా నటీనటులందరూ కూడా బోయపాటి పెట్టిన ఫ్రేమ్ లో నిండిపోయి న్యాయం చేశారు.ఫస్టాఫ్ అయ్యే వరకు అసలు కథ ఏమిటి? అనేది సదరు ప్రేక్షకుడికి అర్ధం కాకుండా అసలు కథ గురించి పట్టించుకోకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఈ సినిమాని చూస్తే బీహారీ, భోజపురి సినిమాలను తలపిస్తాయి.ముఖ్యంగా రెండో రామ్ చేసే రెండు పోరాటాలు అతి అనే పదం కూడా ఆవళించేలా చేశాడు బోయపాటి శ్రీను.అయితే దర్శకుడిగా బోయపాటి శ్రీను మార్క్ అనేది బాలయ్యకు మాత్రమే సింక్ అయ్యింది. సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ మ్యానేజ్ చేశాడు కానీ.. మిగతా హీరోలు ఆ స్థాయి సెన్స్ లెస్ మాస్ ను హ్యాండిల్ చేయలేరు అని ఇప్పుడు మరోసారి రుజువైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: