జైలర్ 2 కోసం డైరెక్టర్ అందుకున్న అడ్వాన్స్ ఎంతో తెలుసా..?

Divya
సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లనే సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ సినిమా ఇందులో నటించినా కూడా భారీ విజయాన్ని అందించింది. గత కొన్ని యేళ్లు గా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న రజనీకాంత్ కి మంచి కం బ్యాక్ వచ్చిందని చెప్పాలి. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ.700 కోట్ల వసూలను కూడా రాబట్టింది.
ఇక ఈ చిత్రానికి సీక్వెల్  నీ కూడా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇందుకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ 2 చిత్రానికి స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం కోసం నెల్సన్ కు నిర్మాత కళానిధి మారన్ ఊహించిన విధంగా రెమ్యునరేషన్ ను  అడ్వాన్స్ రూపంలో ఇచ్చేసారన్న వార్త వినిపిస్తోంది. ఈ సినిమా కోసం రూ.55 కోట్ల చెక్ ను ఆయనకు అందించారన్నది సమాచారం. అయితే ఈ చిత్రాన్ని కూడా సన్ పిక్చర్స్ బ్యానర్ పైనే కళానిధి మారన్ సినిమాని రూపొందిస్తున్నారు.

ఈ చిత్రానికి కూడా జైలర్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ స్వరాలు అందిస్తున్నారు. ప్రస్తుతం టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఒక సినిమాలో రజనీకాంత్ నటిస్తున్నారు. తలైవా 170 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతాన్ని అందించబోతున్నారు. దీంతోపాటు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో మరో చిత్రంలో కూడా రజినీకాంత్ నటించిన బోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: