నాని కోసం రంగంలోకి రాజమౌళి కాంపౌండ్ !

Seetha Sailaja
నేచురల్ స్టార్ నాని కి రాజమౌలితో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ సాన్నిహిత్యంతోనే జక్కన్న ‘ఈగ’ మూవీలో అతడికి మంచి అవకాశం ఇచ్చాడు. అయితే ఆతరువాత మారిపోయిన పరిస్థితులు వల్ల రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగి పోవడంతో అతడి ఆలోచనలు అన్నీ మారిపోయి అత్యంత భారీ సినిమాల నిర్మాణం వైపు అడుగులు వేయడంతో మళ్ళీ మరొకసారి నాని రాజమౌళిల కాంబినేషన్ రిపీట్ కాలేదు.

‘దసరా’ మూవీతో 100 కోట్ల హీరోగా మారిన నాని వచ్చే డిసెంబర్ కు ‘హాయ్ నాన్న’ మూవీతో క్రిస్మస్ రేస్ ను పలకరించబోతున్నాడు. ఈ మూవీ పై కూడ భారీ అంచనాలు ఉన్న నేపధ్యంలో నాని తదుపరి నటించే సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈపరిస్థితుల మధ్య నాని కోసం రాజమౌళి తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక డిఫరెంట్ కథను సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈసినిమాకు తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు తమిళ భాషలలొ ఒకేసారి నిర్మాణం జరుపుకుని ఒకేసారి విడుదల అయ్యేలా ఈ మూవీని ప్లాన్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో మంచి ఇమేజ్ ని తెచ్చుకున్న నాని మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో నానీకి ఇప్పటివరకు సరైన ఇమేజ్ ఏర్పడలేదు. గతంలో తమిళనాడులో తన మార్కెట్ ను పెంచుకోవాలని నాని ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు.

దీనితో ఈసారి తమిళ దర్శకుడుని ఆధారంగా చేసుకుని నాని మరొకసారి తన ప్రయత్నం మళ్ళీ మొదలు పెట్టాడు. తమిళ శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘డాన్’ సినిమాతో దర్శకుడు శిబి చక్రవర్తి ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. వెరైటీ సినిమాలాను డిఫరెంట్ కథలతో తీస్తాడు అని పేరు పొందిన ఈ దర్శకుడు నాని కోరుకున్న బ్రేక్ ను కోలీవుడ్ లో ఎంతవరకు ఇస్తాడో చూడాలి. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు అంతా పాన్ ఇండియా హీరోలుగా మారుతున్న పరిస్థితులలో నాని కూడ అదే బాట అనుసరిస్తున్నాడు అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: