"స్కంద" కి బుక్ మై షో లో సూపర్ రెస్పాన్స్..!

Pulgam Srinivas
రామ్ పోతినేని ఆఖరుగా ది వారియర్ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ సినిమాలో ఈ యువ నటుడు డాక్టర్ మరియు పోలీస్ పాత్రల్లో నటించి రెండు పాత్రల్లో కూడా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇకపోతే ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... ఆది పినిశెట్టి ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. తమిళ దర్శకుడు లింగసామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఒకే సారి తెలుగు , తమిళ భాషల్లో విడుదల చేయగా ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది.


దానితో ఈ మూవీ చివరగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా ది వారియర్ లాంటి యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకులను నిరుత్సాహ పరిచిన రామ్ తాజాగా స్కంద అనే సినిమాలో హీరోగా నటించాడు. శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... బోయపాటి శ్రీను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఈ రోజు అనగా సెప్టెంబర్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల నుండి ఈ సినిమా టికెట్ బుకింగ్ లను బుక్ మై షో లో ఈ మూవీ మేకర్స్ అందుబాటు లోకి తీసుకు వచ్చారు.
 


ఇకపోతే ఈ మూవీ టికెట్ లకి బుక్ మై షో యాప్ లో అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ కి బుక్ మై షో యాప్ లో ఇప్పటికే 200 కే ప్లస్ ఇంట్రెస్ట్ లు కూడా వచ్చాయి. ఇలా ప్రేక్షకుల నుండి ఈ యాప్ లో స్కంద మూవీ కి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఎలాంటి టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: