బేబీ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన అందాల తార వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ తెలుగమ్మాయి మొదటి సినిమాతోనే హీరోయిన్గా భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ఒకసారిగా స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె నటించిన బేబీ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ప్రస్తుతం పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ నుండి వైష్ణవి కి వరుస ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె నెక్స్ట్ సినిమాకి సంబంధించిన అప్డేట్ అయితే ఇప్పటివరకు రాలేదు కానీ ఇప్పటికే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ తో ఒక సినిమా చేయడానికి వైష్ణవి చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.
దానితోపాటు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమా కోసం కూడా వైష్ణవి చైతన్యని హీరోయిన్గా తీసుకోబోతున్నారు అన్న వార్తలు వినిపస్తున్నాయి . ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమా ఏంటి అన్నది అనౌన్స్ చేయలేదు. తాజాగా ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్ లో నాగ వంశీ సైతం వైష్ణవి చైతన్యను ఒక సినిమా కోసం తీసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇలా మూడు పెద్ద బ్యానర్స్ లో మూడు పెద్ద సినిమాలను చేయడానికి వైష్ణవి చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ సైతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దశాబ్దాల నుండి చూసుకుంటే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ సొంతం చేసుకున్న అందాల భామలు ఒకరిద్దరూ కనిపిస్తున్నారు. వారు సైతం స్టార్ హీరోలో సినిమాల్లో నటిస్తున్నారు. కానీ వైష్ణవి చైతన్య ఆ ట్రెండ్ ను బ్రేక్ చేసింది అని చెప్పాలి. దానితోపాటు ప్రస్తుతం పెద్ద సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఈ సినిమా కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి బేబీ భామకి ఇంకెన్ని ప్రొడక్షన్ హౌస్లలో కొత్త సినిమాల ఆఫర్లు వస్తాయి అన్నది వేచి చూడాల్సిందే. ఇక ఈ పెద్ద బ్యానర్స్ లోనే కాకుండా సాయి రాజేష్ సైతం మరో 3 సినిమాలు వైష్ణవితో చేయడానికి ఇప్పటికే అగ్రిమెంట్ సైతం కుదిర్చుకున్నట్లుగా తెలుస్తోంది...!!