టాలీవుడ్ లో మల్టస్టారర్ సినిమాలు రావడం చాలా తక్కువ. కొందరు హీరోలు చేస్తున్నారు కానీ ఫ్యాన్ బేస్ కలిగిన ఇద్దరు హీరోలు మాత్రం చేయడానికి ముందుకు రావడం లేదు. రాజమౌళి కారణంగా త్రిబుల్ ఆర్ సినిమాతో ఆసాధ్యం అనుకున్న పని సుసాధ్యమైంది. నందమూరి హీరో ఎన్టీఆర్ మెగా హీరో రామ్ చరణ్ కలిసి ఈ సినిమాలో కనిపించారు. అలా ఇద్దరు పెద్ద హీరోల కాంబినేషన్లో వచ్చిన సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. అచ్చం వీళ్ళలాంటి కాంబోనే పవన్ కళ్యాణ్ మహేష్ బాబుది. చెప్పాలి అంటే తెలుగులో వీరిద్దరికీ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా
చెప్పనవసరం లేదు. మహేష్ పవన్ లతో మల్టీస్టారర్ చేయాలి అని ఎప్పటి నుండో అభిమానులు కోరుకుంటున్నారు. అయితే గతంలో ఈ కాంబినేషన్ రావాల్సింది. కానీ కుదరలేదు అని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఇటీవల పేర్కొన్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకీ మహేష్ బాబు కలిసి కనిపించారు. వెంకటేష్ పెద్దోడిగా మహేష్ బాబు చిన్నోడిగా కనిపించారు. అయితే పెద్దోడి పాత్రకు ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకున్నారట శ్రీకాంత్ అడ్డాల. అప్పుడు పవన్ కళ్యాణ్ వేరే సినిమాతో బిజీగా ఉన్న కారణంగా ఈ సినిమాలో చేయడం కుదరలేదు అనీ ఆయన వివరించారు.
నిజంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో పవన్ మహేష్ బాబు కలిసి నటిస్తే ఆ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ బద్దలు అయ్యేది. కచ్చితంగా ఎంతో గొప్ప విజయాన్ని అందుకునేది. వీరిద్దరూ కలిసి రెండు సినిమాలు చేశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సూపర్ హిట్ కాగా బ్రహ్మోత్సవం సినిమా నిరాశపరిచింది. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల పెదకాపు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సెప్టెంబర్ 29న ఈ సినిమా వరల్డ్ వైడ్గా విడుదల కాబోతోంది. నూతన హీరో విరాట్ కర్ణ ఇందులో హీరోగా నటిస్తున్నారు. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాత. పెదగాపూ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. ఇప్పటికే ట్రైలర్ మంచి రెస్పాన్స్ని అందుకోగా సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఇందులో అనసూయ సైతం ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది..!!