యానిమల్: బాలీవుడ్కి మరో 1000 కోట్లు పక్కా?

Purushottham Vinay
టాలీవుడ్ మోస్ట్ వైలెంట్ & టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లో కబీర్ సింగ్ తో భారీ హిట్ కొట్టి ఫస్ట్ సినిమాతోనే అక్కడ టాప్ డైరెక్టర్ లలో ఒకడిగా జెండా పాతేసాడు.సందీప్ ఇప్పుడు బాలీవుడ్ లో చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ యానిమల్. స్టార్ హీరో రణ్బీర్ కపూర్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ పాన్ ఇండియా సినిమాపై ప్రేక్షకుల్లో చాలా భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా పోస్టర్స్ కూడా ఉండటంతో నార్త్ ప్రేక్షకులతో పాటు  సౌత్ సినిమా ఇండస్ట్రీ కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోంది.ఆ పోస్టర్స్ ఇంకా ప్రీ టీజర్ అయితే ఈ సినిమాపై ఓ రేంజ్ లో హైప్ తీసుకొచ్చాయి.ఇక తాజాగా యానిమల్ సినిమాలో విలన్ గా చేస్తున్న బాబీ డియోల్ పోస్టర్ రివీల్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.మొహం నిండా రక్తంతో ఉన్న బాబీ డియోల్ పోస్టర్ చాలా భయంకరంగా ఉంది.


ఇందులో బ్లడ్ షెడ్ లో మోస్ట్ వయొలెంట్ మెన్ గా కనిపిస్తున్నాడు బాబీ డియోల్. కేవలం ఈ ఒక్క పోస్టర్ తోనే బాలీవుడ్ ఇండస్ట్రీకి సినిమా ఎలా ఉండబోతుందో చూపించాడు మన తెలుగు డైరెక్టర్ సందీప్.రేపు 10 గంటలకు టీజర్ రిలీజ్ కానుంది. ఈ టీజర్ మొత్తం 2 మినిట్స్ 30 సెకండ్స్ ఉండబోతుందట. ఈ సినిమాకి హిట్టు టాక్ వస్తే పక్కాగా 1000 కోట్ల వసూళ్లు వస్తాయట.అప్పుడు సందీప్ తెరకెక్కించిన కబీర్ సింగ్ ప్రమోషన్స్ లో భాగంగా.. సినిమాల్లో అసలు వయొలెన్స్ అంటే ఎలా ఉంటుందో నా తరువాత సినిమాలో చూపిస్తానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అది సీరియస్ గా తీసుకున్నాడని యానిమల్ నుండి రిలీజ్ అవుతున్న పోస్టర్స్ చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ఇక మొత్తంగా చెప్పాలంటే.. ఈ యానిమల్ సినిమాతో బాలీవుడ్ ను భయపెట్టేందుకు సందీప్ సిద్ధమయ్యాడని చెప్పాలి. మరి పోస్టర్సే ఈ రేంజ్ లో ఉన్నాయంటే.. సినిమా చూశాక ఆడియన్స్ రియాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: