
తమిళంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాలీవుడ్ చిత్రాలు..!!
ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి సినిమా మొదటి భాగం 75 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక రెండవ భాగం 153 కోట్లు రాబట్టింది. rrr చిత్రం 80 కోట్ల రూపాయల వరకు రాబట్టింది. నాలుగవ స్థానంలో పుష్ప సినిమా 30 కోట్లు.. ఊపిరి సినిమా 27.2 కోట్లు రాబట్టక మహేష్ నటించిన స్పైడర్ సినిమా 25 కోట్లు. నాని నటించిన ఈగ సినిమా 24 కోట్లు.. అనుష్క నటించిన అరుంధతి సినిమా 14 కోట్లు.. ప్రభాస్ నటించిన సాహో చిత్రం 12.2 కొట్లు .. విజయ్ దేవరకొండ నటించిన ఖుషి చిత్రం 10.8 కోట్లు సీతారామం సినిమా 10.4 కోట్లు రుద్రమదేవి సినిమా 9.8 కోట్లు. భాగమతి 9.8 కోట్ల రూపాయలను రాబట్టింది.
ఇందులో అత్యధికంగా చూసుకుంటే అనుష్క నటించిన చిత్రాలే ఎక్కువగా తమిళనాడు లో మంచి క్రేజ్ అందుకొని కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత స్థానంలో ప్రభాస్ నటించిన చిత్రాలు ఉండడం గమనార్హం. ఇక రాబోయే రోజుల్లో అన్ని భాషలలో కూడా పలు చిత్రాలు విడుదలై భారీగానే కలెక్షన్స్ రాబట్టే విధంగా పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకే తమిళంలో విడుదలవుతున్న చిత్రాలను కూడా ఇతర భాషలలో విడుదల చేసి బాగానే పాపులారిటీ సంపాదిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ లిస్టులో మరిన్ని సినిమాలు చేరుతాయేమో చూడాలి మరి.