డైరెక్టర్ తో పెళ్లి పై స్పందించిన సాయి పల్లవి..!!

Anilkumar
సినీ ఇండస్ట్రీ అన్న తర్వాత హీరో హీరోయిన్లపై రూమర్స్ రావడం చాలా కామన్. ముఖ్యంగా హీరోయిన్లు ఎవరితోనైనా సరే కొద్దిగా క్లోజ్ గా ఉంటే చాలు వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ ఎఫైర్లు అంటగడుతూ ఉంటారు.
 ఇక సోషల్ మీడియా వచ్చాక ఈ గాసిప్స్ కి హద్దు పద్దు లేకుండా పోయింది. సెలబ్రెటీల ఫోటోలను తీసుకొని దాన్ని ఎడిట్ చేసి ఇష్టం వచ్చిన కామెంట్స్ పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది నాచురల్ బ్యూటీ సాయి పల్లవి. గత మూడు రోజుల నుంచి సాయి పల్లవి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందన్న వార్తలు నెట్టింట తెగ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఓ డైరెక్టర్ ని సాయి పల్లవి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని, 

అందుకు సంబంధించిన ఫోటో ఇదే అని, వారిద్దరూ దండలతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో కొందరు షేర్ చేసి వైరల్ చేశారు. దీంతో చాలామంది నిజంగానే సాయి పల్లవి పెళ్ళి అయిపోయిందని నమ్మేశారు. అసలు ఆ ఫోటోలో ఉన్న దర్శకుడు ఎవరరో కూడా పట్టించుకోలేదు? అసలు విషయం ఏంటంటే, ఆ ఫోటో ఓ సినిమా పూజా కార్యక్రమంలో భాగంగా తీసింది. ఆ ఫోటోలో ఉన్న దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమాలో సాయి పల్లవి నటిస్తోంది. తమిళ ఇండస్ట్రీలో ఓ సినిమాకి పూజా కార్యక్రమం చేస్తున్నారంటే చిత్ర యూనిట్ మొత్తానికి దండలు వేసి పండితులు వారిని ఆశీర్వదిస్తారు  అలా చిత్ర బృందం మొత్తం నిలబడి ఉన్న ఫోటోలో కేవలం డైరెక్టర్, సాయి పల్లవి ఫోటోలు కట్ చేసి పెళ్లి ఫోటోగా చిత్రీకరించారు. 

దాంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇక ఎట్టకేలకు ఈ న్యూస్ పై సాయి పల్లవి రియాక్ట్ అయింది. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదికగా  " నిజం చెప్పాలంటే నేను రూమర్స్ ని పెద్దగా పట్టించుకోను. కానీ అది కుటుంబ సభ్యులైన స్నేహితులను కలిగి ఉన్నప్పుడు నేను మాట్లాడాలి. నా సినిమా పూజా కార్యక్రమం నుంచి ఒక ఫోటోను ఉద్దేశపూర్వకంగా ఎడిట్ చేసి అసహ్యకరమైన ఉద్దేశాలతో కొన్ని ఫేక్ అకౌంట్స్ ద్వారా పబ్లిష్ చేయిస్తున్నారు. నా వర్క్ ఫ్రంట్ లో పంచుకోవడానికి నాకు ఆహ్లాదకరమైన ప్రకటనలు ఉన్నప్పుడు ఇలాంటి జాబ్ లెస్ పనులు చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇలా ఎదుటివారికి అసౌకర్యం కలిగించడం పూర్తిగా నీచమైంది" అంటూ  రాస్కొచ్చింది సాయి పల్లవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: