సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేసిన సాయి పల్లవి....!!

murali krishna
టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో సాయి పల్లవి అంటే తెలియని వారు ఉండరు. తన అభినయం తో యువకులకు నిద్ర లేకుండా చేయిస్తుంటది. ఆమె సినిమాలు సెలెక్ట్ చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహారిస్తుంది. అందుకనే ఆమె చేసే సినిమాల్లో తన పాత్రకు గుర్తింపు ఉంటేనే ఒప్పుకుంటది. లేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో ఐనసారే ఆ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేస్తుంది.సాయి పల్లవికి ఓ తమిళ దర్శకుడితో పెళ్ళైపోయినట్టు గత రెండు, మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఓ తమిళ దర్శకుడిని ఆమె పెళ్లి చేసుకుంది అంటూ దండలతో సాయి పల్లవి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే ఇది సాయి పల్లవి పెళ్ళికి సంబంధించిన ఫోటో కాదు. శివ కార్తికేయన్ తో తమిళంలో ఆమె నటిస్తున్న సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటో. అందులో ఆ చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి పక్కన సాయి పల్లవి పూల మాల వేసుకుని కనిపించడంతో కొంతమంది ఆ ఫోటోని క్రాప్ చేసి .. ఆమెకు పెళ్ళై పోయినట్టు ప్రచారం చేశారు. తాజాగా దీనిపై సాయి పల్లవి స్పందించింది. సాయి పల్లవి ఈ విషయంపై స్పందిస్తూ.. "వాస్తవానికి నేను ఎప్పుడూ రూమర్‌లను పట్టించుకోను, సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. కానీ ఆ రూమర్స్ లో.. నా కుటుంబం అనుకున్న స్నేహితుల ఇన్వాల్వ్ అయ్యి ఉంటే నేను స్పందించాలి.
 నా కొత్త సినిమా పూజా కార్యక్రమాల్లో దిగిన ఓ ఫొటోనీ క్రాప్ (కట్) చేసి.. ఉద్దేశపూర్వకంగా నాకు పెళ్లైనట్టు పెయిడ్ అకౌంట్స్‌ నుండి ప్రచారం చేశారు. నేను నా వృత్తికి సంబంధించిన విషయాలను మాత్రమే మీతో పంచుకోవాలని అనుకున్నప్పుడు ఇలాంటి పనికిమాలిన విషయాలు ప్రచారమవ్వడం చూస్తుంటే బాధ కలుగుతుంది. ఇవి నన్ను చాలా బాధపెడుతున్నాయి" అంటూ సాయి పల్లవి  తన సోషల్ మీడియా ద్వారా తన బాధను వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: