ఆకట్టుకుంటున్న 'దొరసాని' డైరెక్టర్ 'భరతనాట్యం' టైటిల్ పోస్టర్!

Anilkumar
ఆనంద్ దేవరకొండ శివాత్మిక రాజశేఖర్ లను హీరో హీరోయిన్లు గా పరిచయం చేస్తూ దొరసాని సినిమాతీశాడు కే.ఆర్ మహేంద్ర. తాజాగా ఇప్పుడు తన రెండవ సినిమాని ప్రకటించారు. పాపులర్ పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే తనయుడు సూర్యాతేజ ను హీరోగా పరిచయం చేస్తూ భరతనాట్యం అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు.
 తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. సినిమాలో సూర్య తేజ హీరోగా నటించడమే కాకుండా డైరెక్టర్ కెవిఆర్ మహేంద్ర తో కలిసి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా రాశారు. పిఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై పాయల్ సరాఫ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సూర్యతేజ సరసన మీనాక్షి గోస్వామి కథానాయికగా నటిస్తోంది. 

తాజాగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్లుక్ ని మేకర్స్ విడుదల విడుదల చేశారు. పోస్టర్ ని చాలా వినూత్నంగా డిజైన్ చేశారు. క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతోంది. 'భరతనాట్యం' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'ప్రపంచంలోనే అత్యంత అందమైన మోసం' అనేది క్యాప్షన్ గా పెట్టారు. ఇక పోస్టర్లో టైటిల్ పై రక్తపు గుర్తులు ఉండడం గమనించవచ్చు. అలాగే హీరో సూర్య తేజ డిఫరెంట్ షేడ్స్ తో ట్రెండీ లుక్ లో చాలా స్టైలిష్ గా కనిపించాడు  అతని చుట్టూ పూల కొమ్మలు చుట్టుకుని ఉండగా, సినిమాలో ప్రధాన తారాగణమైన మీనాక్షి గోస్వామి, వైవా హర్ష, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, సలీం ఫేకు, టెంపర్ వంశీ పోస్టర్లో కనిపించారు. 

పోస్టర్లోనే పలువురు కమెడియన్స్ కనిపించడంతో ఈ సినిమా క్రైమ్ తో పాటు వినోదాత్మకంగా ఉండబోతున్నట్లు మేకర్స్ పోస్టర్ తోనే స్పష్టం చేశారు. ఇక ట్యాగ్ లైన్ సూచించినట్లు భరతనాట్యానికి సినిమా కథకి కనెక్షన్ ఉంది. పోస్టర్లో ఓ గన్ కనిపించడం సినిమా క్రైమ్ సైట్ ను నిర్దేశస్తుంది. ఓవరాల్ గా భరతనాట్యం ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై పాజిటివ్ ఇంప్రెషన్ కలిగించింది. క్రైమ్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి 'భరతనాట్యం' అనే క్లాసిక్ టైటిల్ ఎందుకు పెట్టారు అనేది తెలియాలంటే టీజర్ విడుదల అయ్యేంతవరకు ఆగాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: