'చంద్రముఖి -2' గూర్చి గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న మేకర్స్...!!

murali krishna
స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్,మరియు డైరెక్టర్ అయిన రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'చంద్రముఖి 2'.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తుంది.అగ్ర నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియర్ దర్శకుడు డైరెక్టర్ పి.వాసు గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 28న గ్రాండ్ గా విడుదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో 'చంద్రముఖి 2' చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై రిలీజ్ చేస్తున్నారు.అయితే రీసెంట్‌గా విడుదల అయిన 'చంద్రముఖి 2' ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలు నెక్ట్స్ రేంజ్‌కి తీసుకెళ్లింది. 

17 సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చంద్రముఖి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు లారెన్స్ హీరోగా చంద్రముఖి సినిమాకు సీక్వెల్ ను రూపొందించారు మేకర్స్.. ఓ వైపు హారర్, మరో వైపు కామెడీ ఎలిమెంట్స్‌తో చంద్రముఖి 2 అలరించనుందని ట్రైలర్‌ చూస్తేనే అర్ధం అవుతుంది. ఈ సినిమాలో చంద్రముఖిగా కంగనా రనౌత్ మెప్పించనుండగా  వేట్టయ రాజాగా రాఘవ లారెన్స్ అలరించబోతున్నారు.అయితే ఈ సినిమా విడుదల దగ్గర పడుతుందడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ప్రమోషన్స్ లో భాగంగా సెప్టెంబర్ 24న 'చంద్రముఖి 2' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌ జె.ఆర్.సి.కన్వెన్షన్ సెంటర్‌లో  ఎంతో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు.

ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజర్స్ యువీ మీడియా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్ లెవల్లో నిర్వహించడానికి పక్కా ప్రణాళిక రూపొందిస్తుంది.ఈ సినిమా తొలత సెప్టెంబర్ 15 న విడుదల చేయాలి అనుకున్నా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల సెప్టెంబర్ 28 కి వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: