చిరంజీవి మెగా 157 లో ముగ్గురు స్టార్ హీరోయిన్స్.. ఎవరంటే..!?

Anilkumar
బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ మెగా 157 గా వస్తున్న ఈ ప్రాజెక్టుకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ ఈ సినిమా నుండి విడుదల చేసిన పోస్టర్ సైతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనిలో మొదలైనట్లుగా  ఒక పోస్ట్ షేర్ చేశారు మేకర్స్ . ఇందులో భాగంగానే.. మీ అందరికీ సినిమాటిక్ అడ్వెంచర్ను అందించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము అని చిరంజీవి టీం తో దిగిన ఫోటోలు డైరెక్టర్ సోషల్ మీడియా వేదికగా

షేర్ చేయడం జరిగింది. దాంతో ఆయన షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే హీరోయిన్లుగా ఎవరిని ఎంపిక చేయబోతున్నారు అన్నదానిపై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ రాకపోయినప్పటికీ ప్రస్తుతం ఒక అప్డేట్ ఎంతో వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమాలో కద అనుగుణంగా మూడు ఫిమేల్ లేదా రోల్స్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఐశ్వర్య రాయి మృనాల్ ఠాగూర్ లని సంప్రదించినట్లుగా కూడా సమాచారం వినబడుతోంది. అయితే మరో పాత్ర కోసం అనుష్క శెట్టిని సైతం అనుకున్నట్లుగా తెలుస్తోంది.

అనుష్క శెట్టి అయితే మెయిన్ రోడ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని భావించిన మేకర్స్ అనుష్కని తీసుకోవడానికి సిద్ధమయ్యారిట. ఇక ఈ వార్తపై అనుష్క ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు.  మెగాస్టార్ సినిమాలో ఎవరెవరు హీరోయిన్ల ఛాన్సులు కొట్టేశారు అన్నది అధికారిక ప్రకటన వచ్చేవరకు తెలీదు. ఇక ఈ సినిమాని టాప్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ విక్రం భారీ బడ్జెట్ తో తెరకిస్తున్నారు.  ఈ సినిమాతో పాటు చిరంజీవి మరోవైపు బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సైతం మరొక సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అలా ఈ సినిమాకి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: