షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన జవాన్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది నయనతార. తమిళ ఆదర్శకుడు అటలి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో షారుక్ ఖాన్ తో పోటీపడి మరీ నటించింది. అయితే తాజాగా షారుక్ ఖాన్ తో కలిసి నటించిన కామెంట్లను చేసింది నాయనతార. హీరోయిన్గా సౌత్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఆమె టాప్ హీరోయిన్గా ఎదిగింది. దానితోపాటు సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. 40 ఏళ్లు చేరువలో ఉన్నప్పటికీ అదే డిమాండ్ తో దోసకపోతోంది. ఇటీవల థియేటర్స్లోకి వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని
అందుకోవడంతో పాటు ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటుంది. అయితే ఈ సినిమాతో హిందీ ఆడియన్స్ అభిమానాన్ని సైతం గెలుచుకుంది నయనతార. తాజాగా ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ తో నటించడం పై పలు కామెంట్లను చేసింది నాయనతార. అయితే ఈ నేపథ్యంలోనే మీడియా కంటపడ్డ నయనతార జవాన్ సినిమా గురించి ఏం మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ.. "నేను చిన్నప్పటినుండి షారుఖ్ ఖాన్ వీరాభిమానిని దిల్వాలే దుల్హనియా లేజాయేంగే ఒక 50 సార్లు చూసి ఉంటాను.. జీవితంలో షారుఖ్ఖాన్ డైరెక్ట్ గా చూస్తే చాలు అనుకున్న నాకు ఒకసారి ఒక ఫంక్షన్ లో కలిసే అవకాశం దొరికింది.
అప్పుడు ఆయనతో చాలా బాగా మాట్లాడాను. అంతేకాదు నిన్ను బాలీవుడ్ కి తీసుకెళ్తాను అని అన్నారు. కానీ అప్పుడు ఆయన సరదాగా అన్నారు అని అనుకున్నాను కానీ ఆ సమయం లో తధాస్తు దేవతలో పైనుంచి తధాస్తు అన్నారేమో.. అది ఇప్పుడు నిజమే అయింది అంటూ వెల్లడించింది నయనతార. అప్పుడు ఆయన చెప్పడం తను షారుఖ్ సినిమాతోనే బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వడం బాలీవుడ్ లో నా మొదటి సినిమాని ఈ రేంజ్ లో విజయాన్ని సాధించడం చాలా ఆనందంగా ఉంది.." అంటూ ఈ సందర్భంగా వెల్లడించి నేను నయనతార..!!