కళ్యాణ్ రామ్ సినిమాకు ఊహించని సమస్యలు ?
సాధారణంగా ఒక సినిమా ప్రారంభం అయ్యాక ఆసినీమా దర్శకుడికి హీరోకి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడితే ఆ మూవీ ప్రాజెక్టు నుండి దర్శకుడు తప్పుకున్న సందర్భాలు గతంలో చాల జరిగాయి. సుభాష్ చంద్రబోస్ కథతో సీక్రెట్ ఏజెంట్ అనే క్యాప్షన్ తో పీరియాడిక్ మూవీగా కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న ‘డెవిల్’ మూవీ నుండి ఆసినిమా దర్శకుడు తప్పుకున్నాడు అంటూ వస్తున్న వార్తలు విని ఇండస్ట్రి వర్గాలు షాక్ అవుతున్నాయి.
ఈ సినిమాకు ‘పుష్ప’ రైటర్ శ్రీకాంత్ విస్సా కథను అందించగా నవీన్ దర్శకుడిగా ప్రారంభం జరిగి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలవరకు జరిగింది. దర్శకుడు నవీన్ కి విజువల్ ఎఫెక్ట్స్ లో మంచి అనుభవం ఉంది. ‘అవతార్’ వంటి హాలివుడ్ టాప్ సినిమాలకు అతడు వర్క్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ కి అతనే రైట్ ఛాయిస్ అని హీరో కళ్యాణ్ రామ్ తో పాటు నిర్మాతలు కూడా భావించారు అని టాక్.
దర్శకుడు నవీన్ కూడా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ బెస్ట్ వర్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ మూవీ దర్శకుడు ఈ మూవీ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు అని వస్తున్న వార్తలు విని ఇండస్ట్రి వర్గాలు షాక్ అవుతున్నాయి. దీనికితోడు ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ లో దర్శకుడి పేరు తొలగించి ఆప్లేస్ లో అభిషేక్ పిక్చర్స్ ఫిల్మ్ అంటూ నిర్మాణ సంస్థ పేరు పెట్టడం మరింత సందేహాలకు తావిస్తోంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
సాధారణం సినిమాలకు సంబంధించి ఆ సినిమా హీరోకు నిర్మాతకు దర్శకుడికి మధ్య క్రియేటివ్ యేటివ్ డిఫరెన్స్ లు రావడం సర్వసాధారణం. ఇప్పటికే ఈ సినిమా నిర్మాణం చివరి దశకు చేరుకున్న నేపధ్యంలో ఈ విషయంలో కళ్యాణ్ రామ్ ఎలా వ్యవహరిస్తాడు అన్న ఆశక్తి ఇండస్ట్రి వర్గాలలో ఉంది అన్న మాటలు వినిపిస్తున్నాయి..