ప్రభాస్ ను కన్ఫ్యూజ్ చేస్తున్న ఆక్వామెన్ !

Seetha Sailaja
సాధారణంగా టాప్ హీరోల సినిమాలు డిసెంబర్ లో విడుదలకావు.  అయితే ఈసారి డిసెంబర్ లో విడుదలకాబోతున్న సినిమాల లిస్ట్ చూసిన వారికి ఆసినిమాల రేస్ సంక్రాంతి రేస్ ను మించి కనిపిస్తోంది.   ఈ సినిమాలకు తోడు ప్రభాస్ నటించిన ‘సలార్’ డిసెంబర్ లో విడుదల  చేయాలా లేకుంటే నవంబర్ లో విడుదలచేయాల అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అయితే ఇప్పుడు డిసెంబర్ 20న విడుదలకాబోతున్న ‘ఆక్వామెన్ లాస్ట్ కింగ్ డం’ ‘సాలార్’ ను భయపెడుతోంది అంటూ  వార్తలు వస్తున్నాయి.  



దీనికికారణం లేటెస్ట్ గా విడుదల అయిన ఈ హాలీవుడ్ మూవీ ట్రైలర్ అని అంటున్నారు. ఈ ట్రైలర్ చూసిన వారికి ఈ మూవీకి సంబంధించి కథపరంగా ఏది కొత్తదనం లేకపోయినా ఈ మూవీకి సంబంధించిన టేకింగ్ విజువల్ ఎఫెక్ట్స్ చూసినవారికి ఈ సినిమాను మరో ఆలోచన లేకుండా బిగ్ స్క్రీన్ మీద చూడాలి అన్న కోరికను కలుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.



ఈ సినిమా విడుదల అయ్యే సమయానికి తెలుగులో నాని ‘హాయ్ నాన్న’ నితిన్ ‘ఎక్స్ ట్రాడినరి మెన్’ లు కూడవిడుదల అవుతున్నాయి. ఈ సినిమాల విడుదలకు కేవలం ఒకేఒక్క రోజు గ్యాప్ ఇచ్చి వెంకటేష్  ‘సైంధవ్’ కూడ విడుదల అవుతోంది. అయితే కేవలం ఇంగ్షీషులో మాత్రమే కాకుండా  తెలుగులో కూడ డబ్ చేయబడి విడుదల కాబోతున్న  ‘ఆక్వా మెన్’ వల్ల ధియేటర్ల కొరత ఏర్పడటమే కాకుండా ఆమూవీ మ్యానియా ముందు నాని నితిన్ లు ఎంతవరకు నిలబడతారు అన్న సదేహాలు కూడ కొందరకు ఉన్నాయి.



ఈ విషయాలు ‘సలార్’ నిర్మాతల దృష్టి వరకు రావడంతో వారు తమ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాల వద్దా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ‘స్పైడర్ మ్యాన్’ దెబ్బను తట్టుకుని ‘పుష్ప’ ఘనవిజయం సాధించిన విషయం  తెలిసిందే. ఇప్పుడు అలాంటి సాహాన్ని ప్రభాస్ ఎంతవరకు చేస్తాడు అన్న ఆశక్తి ఇండస్ట్రీ వర్గాలలో ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: