దళపతి విజయ్ ఈ సంవత్సరం ప్రారంభంలో వారిసు అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఇకపోతే మొదట ఈ సినిమాను తమిళ్ లో విడుదల చేయగా ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ సినిమాను వారసుడు అనే టైటిల్ తో తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ కి తెలుగు దర్శకుడు అయినటువంటి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ... తెలుగు ప్రొడ్యూసర్ అయినటువంటి దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు.
నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇలా వారసు మూవీ తో మంచి సక్సెస్ ను అందుకున్న విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న లియో అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని అక్టోబర్ 19 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన తెలుగు పోస్టర్ ను విడుదల చేసింది. ఇకపోతే ఈ పోస్టర్ చాలా డిఫరెంట్ గా ఉండడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే విజయ్ , లోకేష్ కాంబో లో రూపొందిన మాస్టర్ మూవీ మంచి విజయం సాధించడం ... అలాగే లోకేష్ ఆఖరిగా తీసిన విక్రమ్ మూవీ సూపర్ సక్సెస్ సాధించడంతో లియో మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.