ఫ్యాన్స్ కి షాక్ ఇవ్వబోతున్న బాలయ్య..!!

Divya
బాలయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద విడుదలవుతుందంటే చాలు అభిమానులు చేసే హంగామా గురించి చెప్పాల్సిన పనిలేదు బాలయ్య ప్రస్తుతం భగవంత్ కేసరి అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా దసరా బరిలో దించేందుకు డైరెక్టర్ అనిల్ రావుపూడి పలు రకాల సన్నహాలు చేస్తూ ఉన్నారు. బాలయ్యకు జోడిగా కాజల్ నటిస్తూ ఉండగా శ్రీ లీల కీలకమైన పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీన సైతం చిత్ర బృందం ప్రకటించడం జరిగింది. అక్టోబర్ 19న ఈ సినిమా విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు.


అయితే గత కొద్ది రోజుల క్రితం వరకు ఇదంతా అనుకున్నట్టే జరిగిన దసరాకి కచ్చితంగా బాలయ్య ఈసారి తన హవా చూపిస్తారని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా ఊహించని ట్విస్ట్ ఇప్పుడు పడబోతుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం భగవంత్ కేసరీ సినిమా వాయిదా పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు జైలుకు వెళ్లడం వల్ల బాలయ్య ఇప్పుడు టిడిపి పార్టీ తరఫున ప్రెస్మీట్లో పెట్టి పలు రకాల నిర్ణయాలను తీసుకునేందుకు లీడ్ చేస్తున్నట్లు సమాచారం.


దీంతో భగవంత్ కేసరి సినిమా షూటింగ్ ఇంకా కొద్ది రోజులు చేస్తే సినిమా షూటింగ్ ఫినిష్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యేందుకు ఎక్కువగా అవకాశం ఉన్నట్లు సమాచారం మరొకపక్క లియో టైగర్ నాగేశ్వరరావు సినిమాలు షెడ్యూల్ ప్రకారం థియేటర్లో విడుదల అయ్యేందుకు చిత్ర బృందం పలు సన్న హాలు చేస్తున్నారు. భగవంత్ కేసరి  సినిమా బిజినెస్ పరంగా భారీగానే జరిగిందని థియేటర్ డిస్ట్రిబ్యూటర్ రైట్స్ 60 కోట్లకు అమ్ముడుపోయాయని సమాచారం. ఓటిటీ ,డిజిటల్ స్ట్రిమింగ్ రైట్ 36 కోట్లు వచ్చినట్లు సమాచారం. మరి ఈ సినిమా పైన వినిపిస్తున్న వార్తలు నిజమో కాదో తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: