ఆ స్టార్ హీరొ కోసం రీ ఎంట్రీ ఇవ్వబోతున్న నజ్రియా.. ఏ సినిమాతో అంటే..!?

Anilkumar
తన ఎక్స్ప్రెషన్స్ తోనే యువతను కట్టిపడేసే నజ్రియా నజీమ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ అందానికి ఫిదా అవ్వని ప్రేక్షకులు ఉండరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతలా తన అందం హావభావాలతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ అందాల తార. నాచురల్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఆమె మళ్ళీ ఎప్పుడు రియల్ ఇస్తుందా అని ఆమె అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తన అభిమానులకు శుభవార్త చెప్పింది ఈ బ్యూటీ.


 కోలీవుడ్  స్టార్ హీరో సూర్య ఇటీవల కంగువా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు అన్న సంగతి తెలిసిందే. అతను గిరిజన లెజెండ్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే తన 43 వ సినిమా కోసం దర్శకురాలు సుధా కొంగర స్వరకర్త జీవీ ప్రకాష్ తో మళ్ళీ నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ ముగ్గురు కాంబినేషన్లో ఆకాశం నీ హద్దురా సినిమా వచ్చి నేషనల్ అవార్డును సైతం దక్కించుకుంది. తాజాగా ఇప్పుడు మరొకసారి వీరి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోంది.


దీంతో ఈ సినిమాపై రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. దానికి తోడు వాహద్ ఫాసిల్ భార్య ప్రముఖ స్టార్ హీరోయిన్ నజ్రియా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది అని అంటున్నారు.  అలా ఆమె అభిమానులు ఈ వార్త విని తెగ కుషి అవుతున్నారు. గతంలో భారీలీవుడ్లో భారీ విజయాలను అందుకున్న ఈ అందాల తార ఫాహద్ ఫాదర్ తో పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం చాలా వరకు తగ్గించేసింది. మల్లి ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయింది. ఇదిలా ఉంటే సూర్య కోసమే ఈ సినిమా చేసి.. ఈ సినిమాతోనే రీ ఎంట్రీ ఇవ్వడానికి  రెడీ అయింది అన్న పుకార్ల సైతం వినబడుతున్నాయి. దీంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: