ప్రభాస్ ఆరోగ్యం పై మళ్ళీ వార్తలు !
‘ఆదిపురుష్’ ఫెయిల్ అయిన తరువాత కొన్ని వారాల పాటు అమెరికాలో విశ్రాంతి తీసుకున్న ప్రభాస్ ఈమధ్యనే అమెరికా నుండి తిరిగి వచ్చాడు. దీనితో ప్రభాస్ మళ్ళీ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటాడని అతడి అభిమానులు భావించారు. అయితే ‘సలార్’ మూవీ వాయిదా పడటంతో ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ అమెరికా వెళ్ళిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ‘బాహుబలి’ షూటింగ్ సమయంలో అతడి కాలికి తగిలిన గాయం వలన అతడికి కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి అంటూ వార్తలు వచ్చాయి.
అయినప్పటికీ ప్రభాస్ వరసపెట్టి సినిమాలు చేస్తూ ఉండటంతో అతడి కాలి గాయం పూర్తిగా తగ్గిపోయింది అంటూ వార్తలు వచ్చాయి. అయితే మళ్ళీ ప్రభాస్ కు తన కాలుకు సంబంధించి సమస్యలు ఏర్పడటంతో ఫైట్స్ సీన్స్ లో అదేవిధంగా పాటల సమయంలో స్టెప్స్ వేసేడప్పుడు తన కాలుకు నొప్పి వస్తున్నప్పటికీ ఆ నొప్పిని పట్టించుకోకుండా ప్రభాస్ ఇప్పటివరకు మేనేజ్ చేశాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పుల హడావిడి జరుగుతోంది.
ఇప్పుడు ‘సలార్’ మూవీ విడుదల మళ్ళీ వాయిదా పడటంతో ప్రభాస్ తన కాలి సమస్య గురించి మరింత శ్రద్ధ పెట్టాలని ఆలోచనలతో మళ్ళీ అమెరికా ప్రయాణం అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రభాస్ అక్కడ తన కాలుకు సంబంధించి ఆపరేషన్ చేయించుకుంటాడా లేదంటే అక్కడ మళ్ళీ రెస్ట్ తీసుకుంటాడా అన్న విషయమై రకరకాల గాసిప్పులు వినిపిస్తున్నాయి. ప్రయస్థుతం ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ కు బ్రేక్ రావడంతో పాటు మారుతి దర్శకత్వంలో నటిస్తున్న మూవీ షూటింగ్ కు కూడ బ్రేక్ పడటంతో ప్రభాస్ మళ్ళీ అమెరికా ప్రయాణం అయ్యాడు అనుకోవాలి..