నటి శోభిత ధూళిపాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల పొన్ని సెల్వన్ టూ లో కనిపించి అలరించింది ఈ చిన్నది. తెలుగులోనే కాకుండా తమిళం మరియు మలయాళం భాషల్లో ప్రస్తుతం అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. తెలుగులో ఈ భామ రెండు మూడు సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో ఆమె చేసిన కొన్ని అన్న సినిమాలో తన అందానికి మంత్రముగ్ధులయ్యారు ఆడియన్స్. శోభిత నటనకు మంచి మార్కులు పడ్డాయని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ నుండి కూడా ఈ అందాల తారకి వరుస ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే మేడ్ ఇన్ హెవెన్ టు లో తార అనే పాత్రలో తన అద్భుతమైన నటనను కనబరిచింది ఈ బ్యూటీ. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది ఈ అందాలతార. ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ..“నేను ఎప్పుడూ తెరపై కనిపించాలి.. చేతినిండా సినిమాలు ఉండాలి అనే ఉద్దేశంతో వచ్చిన ప్రతిపాదిని చేయడానికి ఒప్పుకోను.. సినిమాల విషయంలో నాకంటూ కొన్ని ఆలోచనలు ఇష్టాలు ఉన్నాయి.. వాటికి అనుగుణంగానే నాకు నచ్చిన నా దగ్గరికి వచ్చిన పాత్రలను ఎంచుకుంటూ చేస్తాను.. అంటూ తెలిపింది.
పాత్రల ఎంపికే తప్ప అవకాశాలు అనేవి తన చేతిలో ఉండవు అని.. అలా జరిగితే కరణ్ జోహార్ వంటి గొప్ప దర్శకులతో నేను కలిసి పని చేస్తాను అని.. అవకాశం లేకపోవడంతో ఒకప్పుడు ఉన్న సినిమాలను మనసుపెట్టి చేస్తున్నాను అని.. కమర్షియల్ గా విజయవంతమైన దర్శకులు జోయా అక్తేర్ మేడిన్ హెవెన్ టూ లో ప్రధాన పాత్ర నాకు రావడం ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను అని ఈ సందర్భంగా చెప్పింది. అంతేకాకుండా స్టార్ డైరెక్టర్ మణిరత్నం గారు కొన్ని సెల్వన్ లో నాకు మంచి ప్రధానా పాత్ర ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది.. నాలో ఉన్న ప్రతి గుర్తించి ఈ అవకాశాన్ని ఇచ్చారు అని నేను అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఆ రెండు పాత్రలు వేటిక వేయ భిన్నంగా ఉంటాయి అని ఈ సందర్భంగా తెలిపింది శోభిత..!!