రష్మీ పై పంచులు.. రజినీకాంత్ డైలాగ్ ను ఇమిటేట్ చేసిన భాస్కర్..!!

Anilkumar
బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వేస్తున్న ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ షో ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రతి శుక్రవారం ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులు.
ప్రతివారం సరికొత్త స్కిట్లతో ఆడియన్స్ ని తమ పంచులతో నవ్విస్తున్నారు కమెడియన్స్. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 15న ప్రసారం కాబోతున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ ప్రోమోలో మరోసారి ఇస్మార్ట్ ఇమ్మానియేల్ స్కిట్ హైలెట్ గా నిలిచింది. ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ సూపర్ స్టార్ రజినీకాంత్ గారి డైలాగ్ ని ఇమిటేట్ చేయడం ఆకట్టుకుంది. 


ఇక లేటెస్ట్ ప్రోమోను పరిశీలిస్తే.. ఇమాన్యుల్ భార్య క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఓ ముద్దు ఇవ్వచ్చు కదా అని అంటుంది. దానికి ఇమాన్యుయల్, "అమ్మో.! నేను పెట్టను. ఈ మధ్య మీ పెళ్ళాలు ముద్దు పెడతామని పిలిచి పెదాలు కొరికి పక్కన పెడుతున్నారట" అని చెప్పడంతో కుష్బూ, కృష్ణ భగవాన్ పగలబడి నవ్వారు. ఆ తర్వాత బాబు, వర్షా భార్యాభర్తలు గా ఎంట్రీ ఇచ్చారు." ఏవండీ నేను ఒడ్డున పడిన చాపలా ఉంటానా? అని వర్ష బాబు ని అడుగుతుంది. దానికి బాబు," లేదు కత్తర్ పాపలా ఉంటావు" అని పంచ్ వేయడంతో  షోలో ఒక్కసారిగా నవ్వులు విరిసాయి. దాని అనంతరం భాస్కర్ స్కిట్ ని చూపించారు. 'చిరంజీవి గారి సినిమాలో నువ్వు చేసావు' అని రష్మితో చెబుతూ..


" నీకోసం సినిమా థియేటర్ కి వెళ్తే ఇంటర్వెల్ వరకు కనబడలేదు. సరే ఇంటర్వెల్ తర్వాత వస్తావు కదా అని థియేటర్లో వెయిట్ చేస్తే కింద కర్చీప్ పడింది. ఇలా తీసేలోపే మళ్ళీ వెళ్ళిపోయావు" అంటూ రష్మీ ని ఆటపట్టించడంతో షో లో ఉన్న వాళ్లంతా నవ్వారు." ఊరు వెళ్తే పిల్లలు ఎప్పుడూ పిల్లలు ఎప్పుడూ? అని అడుగుతున్నారు" అని భాస్కర్ భార్య అడగగా," బేబీ ఒకటి గుర్తుపెట్టుకో, అరవని కుక్క ఉండదు. విమర్శించని నోరు ఉండదు. ఇవి రెండూ లేని ఊరే ఉండదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి" అని జైలర్ ఆడియో లాంచ్ లో రజనీకాంత్ చెప్పిన డైలాగ్ను ఇమిటేట్ చేసే ప్రయత్నం చేయగా మధ్యలో కుష్బూ, డైలాగ్ తమిళంలో తప్పు చెప్పావని భాస్కర్ తో అంటుంది. దీంతో భాస్కర్ తెల్లముఖం వేస్తాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: