ఆరెండు సినిమాలకు ఓటీటీ లో ఎదురీత దేనికి సంకేతం !

Seetha Sailaja
ధియేటర్స్ లో విడుదలై బ్లాక్ బష్టర్ హిట్ కొట్టిన సినిమాలు ఓటీటీ లలో  స్ట్రీమ్ అవుతున్నప్పుడు జనం ఆ సినిమాలను ఇప్పటికే ధియేటర్స్ లో చూసినప్పటికి మళ్ళీ మరోసారి ఓటీటీ లో చూస్తూ ఉండటం పరిపాటి. అందువలనే  బ్లాక్ బష్టర్ అయిన సినిమాలను వందల కోట్లు ఖర్చుపెట్టి  ఆసినిమాల ఓటీటీ సంస్థలు ఆ సినిమాల ఓటీటీ  రైట్స్ ను తీసుకుంటూ  ఉంటాయి.



ఎంత బ్లాక్ బష్టర్ అయినప్పటికీ ఆసినిమాను జనం అంతా ధియేటర్స్ లో చూస్తారు అన్న గ్యారెంటీ లేని పరిస్థితి. దీనితో నిర్మాతలకు ఓటీటీ సంస్థలు ఆఫర్స్ చేస్తున్న కోట్లాది రూపాయలు అదనపు ఆదాయంగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో విడుదలై సంచలనాలు సృష్టించడమే కాకుండా వందల కోట్లు కలెక్ట్ చేసిన రజనీకాంత్ ‘జైలర్’ సినిమాకు అమెజాన్ ప్రైమ్ లో కొనసాగుతున్న ఎదురీత అమెజాన్ సంస్థను ఆశ్చర్య పరుస్తున్నట్లు టాక్.



అదేవిధంగా ఆహా లో స్ట్రీమ్ అవుతున్న ‘బేబి’ సినిమాకు కూడ ఓటీటీ ప్రేక్షకుల నుండి వస్తున్న తక్కువ స్పందన ఆసంస్థను ఆశ్చర్య పరుస్తోంది అన్నవార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ‘బేబి’ మూవీకి సుమారు 90 కోట్ల వరకు కలక్షన్స్ వచ్చినట్లు ప్రచారం జరిగినది. అలాంటి సినిమాను ఆహా లో పెద్దగా ప్రేక్షకులు ఎందుకు చూడటం లేదు అన్న విషయం సమాధానం లేని ప్రశ్నగా మారింది అన్నకామెంట్స్ కూడ ఉన్నాయి.



గతంలో ఇదే తరహాలో ఘనవిజయం సాధించిన ‘జాతరత్నాలు’ ‘ఉప్పెన’ ‘వాల్తేరు వీరయ్య’ లాంటి సినిమాలు ఓటీటీ లో ప్రసారం అవుతున్నప్పుడు ఆ ఓటీటీ సినిమాలకు ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రాలేదు అన్నవార్తలు కూడ వచ్చాయి. దీనితో సూపర్ హిట్ సినిమాలను ధియేటర్స్ లో మంచి సౌండ్ తో దక్కేఅనుభూతి ఓటీటీ లలో స్ట్రీమ్ అవుతున్నప్పుడు సగటు ప్రేక్షకుడుకి అందడటం లేదు అన్న ఫీలింగ్ వల్ల కొన్ని సూపర్ హిట్ సినిమాలకు ఓటీటీ లలో ఇలాంటి ఎదురీత ఎదురవుతోంది అన్న విశ్లేషణలు కూడ వస్తున్నాయి. దీనితో ప్రస్తుతం ప్రేక్షకులు విరగబడి చూస్తున్న ‘జవాన్’ మూవీ ఓటీటీ లో ప్రసారం అయినప్పుడు ఇలాంటి ఎదురీత ఎదురవుతుందా అన్నసందేహాలు కొందరికి ఏర్పడుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: