పవర్ స్టార్ పవన్
కళ్యాణ్,
హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న తాజా
సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ
సినిమా కొత్త షెడ్యూల్ మూడు రోజుల క్రితమే స్టార్ట్ అయింది. చాలా గ్యాప్ తర్వాత స్టార్ట్ అయిన ఈ షూటింగ్ మళ్లీ ఆగిపోయింది.
పవన్
కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్ దీనికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. మే నెలలో ఈ
సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయినప్పటికీ పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల పదేపదే షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. శనివారం రోజు
ఆంధ్ర ప్రదేశ్ మాజీ
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని సీఐడీ అధికారులు
అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ విషయంపై పవన్
కళ్యాణ్ సీరియస్ అయ్యారు. వెంటనే యాక్షన్ లోకి దిగి చంద్రబాబుని కలవాలని అనుకున్నారు. కానీ పోలీసులు పవన్ ని అడ్డుకున్నారు. నిజానికి ఆ సమయంలో పవన్ ఉస్తాద్ షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఉన్నట్టుండి చంద్రబాబు
అరెస్ట్ అవడంతో పవన్ వెంటనే రియాక్ట్ అయి
విజయవాడ వెళ్లిపోయారు. పోలీసులు అడ్డుకున్నా కూడా వెనకాడకుండా రోడ్డుపై పడుకుని మరీ తన నిరసన తెలిపారు. పవన్ కి సినిమాలు చేయడం ఎంత ముఖ్యమో రాజకీయంగా ఆక్టివ్ గా ఉండడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఈ విషయంలో ఫ్యాన్స్ ఎప్పుడూ ఆయనకి మద్దతుగానే ఉంటారు.
అయితే పవన్ ఇలా షూటింగ్ మధ్యలో ఆపడం వల్ల నిర్మాతల పరిస్థితి ఏంటి అనే చర్చ మొదలైంది. కానీ పవన్ పరిస్థితి అర్థం చేసుకొని దర్శక నిర్మాతలు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని ముందుగానే అనుకున్నారట. ఎందుకంటే పవన్ కూడా ముందుగా వాళ్లతో ఇదే విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. ఇవన్నీ అంగీకరించాకే పవన్
కళ్యాణ్ మూవీ చేస్తున్నారు. ఇక తాజాగా 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ క్యాన్సిల్ చేసి పవన్
కళ్యాణ్ వెళ్లిపోయినా కూడా
డైరెక్టర్ హరిశ్ శంకర్ మాత్రం షూటింగ్ ఆపలేదట. పవన్ లేకుండా ఇతర నటులతో ఉండే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఇప్పటికే రెండు, మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీకి మూడు నెలలుగా ఎటువంటి షూటింగ్ జరగలేదు.
షూటింగ్ కి బ్రేకులు పడటంతో మూవీ టీం ఈ విషయంలో ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది..!!