బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఇప్పటికే ఈ సంవత్సరం విడుదల అయినటువంటి పటాన్
మూవీ తో సూపర్
సక్సెస్ ను అందుకొని ఈ
మూవీ తో 100 కోట్ల కలెక్షన్ లను కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టాడు. ఇక ఇప్పటికే పటాన్
మూవీ తో సూపర్
సక్సెస్ ను అందుకొని ఫుల్
జోష్ లో ఉన్న షారుక్ తాజాగా
జవాన్ అనే
మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో నయన
తార హీరోయిన్ గా నటించగా ... దీపికా పదుకొనె ఈ
మూవీ లో కీలకమైన పాత్రలో నటించింది. ఇక
ప్రియమణి , యోగి బాబు ఈ
మూవీ లో ముఖ్యమైన పాత్రల్లో నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
అట్లీ ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ
సినిమా నిన్న అనగా
సెప్టెంబర్ 7 వ తేదీన
హిందీ ,
తమిళ్ , తెలుగు భాషల్లో భారీ ఎత్తున విడుదల అయింది. ఇక పటాన్ భారీ
బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత షారుక్ నటించిన
మూవీ కావడం
అట్లీ ఈ
మూవీ కి దర్శకత్వం వహించడంతో ఈ
మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే
బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ
మూవీ కి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. ఈ
మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను
నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఈ
మూవీ థియేటర్ రన్ కొన్ని వారాలు ముగిసిన తర్వాత
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.