OG సినిమా స్టోరీ ఇదేనా..?
అయితే ఇప్పుడు ఈ సినిమా కథ ఇదే అంటూ మరొక టాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది ఇంటర్నేషనల్ మూవీ అయినా డేటా బేస్ IMDB వెబ్సైట్లో ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఓ జాస్ గంభీర్ అనే ఒక టూరిస్ట్ బాయ్ అనుకోకుండా బాంబే కు వెళ్లి అక్కడ చిక్కుకుపోతాడు. అయితే అతను గ్యాంగ్ స్టార్ గా మారాల్సి వస్తుంది ఆ తర్వాత క్రైమ్ మాఫియా తో కూడా అతనికి సంబంధాలు ఏర్పడతాయి అక్కడే ఒక కింగ్ గా మారుతాడు అనే కథాంశంతో OG చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ఈ గొడవలలో తన కుటుంబాలను, సన్నిహితులను కోల్పోతాడు. అనంతరం ప్రతీకారం కోసం విలన్ సామ్రాజ్యాన్ని ఎదిరించే వాడిగా సిద్ధమవుతారు. ఆ తర్వాత అతని జీవితం ఏవిధంగా మారుతుంది అనే ట్విస్టులతో కూడిన సినిమాగా ఉండబోతుందని సమాచారం. ప్రస్తుతం ఈ స్టోరీ లైన్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. డైరెక్టర్ సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ కు తగ్గట్టుగానే ఈ సినిమా కథతో కంటెంట్ ను హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తున్నది. మరి ఏ మేరకు ఈ సినిమా అభిమానులను మెప్పిస్తుందో చూడాలి మరి . ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.