సప్తసాగర మ్యానియాలో తెలుగు ప్రేక్షకులు !

Seetha Sailaja
తెలుగు ప్రేక్షకులకు విశాల హృదయం చాలఎక్కువ. భాషతో సంబంధం లేకుండా పరభాషా సినిమాలను కూడ తెలుగు ప్రేక్షకులు అప్పుడప్పుడు చాల ఎక్కువగా ఆదరించిన సందర్భాలు ఉన్నాయి. ‘కాంతార’ సినిమాకు కన్నడ రాష్ట్రంలో వచ్చిన కలక్షన్స్ కంటే తెలుగు రాష్ట్రాలలో ఆమూవీకి విపరీతమైన కలక్షన్స్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.



ఇలాంటి పరిస్థితుల మధ్య గతవారం విడుదలైన ఒక కన్నడ సినిమాకు తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా యూత్ చూపిస్తున్న ఆదరణ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఆసినిమా “సప్తసాగర దాచే అల్లెల్లో సైడ్ ఏ” ఈమూవీ గత వారం విడుదలైంది. డైరెక్ట్ కన్నడ సినిమాగా ఈమూవీ భాగ్యనగరంలోని కొన్ని ధియేటర్లలో విడుదల అయింది.



ఎవరు ఊహించని విధంగా ఈమూవీకి వచ్చిన పాజిటివ్ టాక్ వల్ల హైదరాబాద్ లో ఈసినిమాను ప్రదర్శిస్తున్న ధియేటర్లు కొన్ని హౌస్ ఫుల్ కావడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ‘777 ఛార్లీ’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన రక్షిత్ శెట్టి హీరోగా ఈమూవీలో నటించారు. నగరంలోనే బడా వ్యాపారవేత్తగా పేరున్న శేఖర్ గౌడ(అవినాష్)దగ్గర కారు డ్రైవర్ గా పని చేస్తుంటాడు మను(రక్షిత్ శెట్టి). ఇతను ప్రేమిస్తున్న ప్రియా(రుక్మిణి వసంత్) గాయని కావాలని లక్ష్యంగా పెట్టుకుంటుంది. సముద్రం దగ్గర ఇల్లు కట్టుకోవాలని ఆమె కల. యజమాని కొడుకు చేసిన తప్పు వల్ల డబ్బు కోసం ఆ నేరం తన మీద వేసుకుని తన ప్రేయసి ప్రియా వద్దంటున్నా రక్షిత్ శెట్టి జైలుకి వెళ్తాడు.



అయితే అక్కడ జైలులో కొన్ని అనుకోని సంఘటనల వల్ల రక్షిత్ శెట్టి మరిన్ని సమస్యలలో పడిపోతాడు. ఒక డిఫరెంట్ కథను దీయఫరెంట్ గా దర్శకుడు హేమంత్ చూపించిన పద్దతి చాలామందికి నచ్చింది. ముఖ్యంగా ఈసినిమా క్లైమాక్స్ జైలు బ్యాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు విపరేతమగా నచ్చినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఒక జైల్ కథకు లవ్ స్టోరీని కనెక్ట్ చేసిన విధానం తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ రుక్మిణి వసంత్ తన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టడంతో ఆమెకు మంచి భవిష్యత్ ఉంటుంది అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: