సూపర్ స్టార్ రజినీకాంత్ నయనతార జంటగా నటించిన చంద్రముఖి సినిమా ఇప్పటివరకు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఈ సినిమా ఎంతటి భారీ విజయని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టించింది ఈ సినిమా. ఇప్పటికీ టీవీలో ఈ సినిమా వస్తే అస్సలు మిస్ కాకుండా చూస్తూ ఉంటారు జనాలు. అయితే ఈ సినిమాలోని పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే. తమిళం తో పాటు తెలుగులో కూడా భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా పేరు చెప్పగానే అందరి పాత్రలు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తాయి.
సూపర్ హిట్ సినిమా చంద్రముఖి సినిమాకి సీక్వల్ రాబోతుంది అని మేకర్స్ ఇప్పటికీ ప్రకటించడంతో ఈ సినిమాపై భారీ అంచునాలు నెలకోన్నాయి. ఇక మొదటి సినిమాకి దర్శకత్వం వహించిన పి వాసు ఇప్పుడు పార్ట్ 2 కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇందులో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాకి మెయిన్ రోలైన చంద్రముఖి పాత్రను బాలీవుడ్ బ్యూటీ కంగనా పోషించబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ పాటలు టీజర్ ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.
ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేవారం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రముఖి 2 సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ప్రస్తుతం ఈ వార్త సినీ ఇండస్ట్రీలో ఒక రేంజ్ లో చక్కర్లు కొడుతుంది. అయితే ఒకవేళ చంద్రముఖి 2 లో సాయి పల్లవి నటించి ఉంటే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయ్యేది అని అంటున్నారు. ఇక ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ పాటలలో కంగనా లుక్స్ బాగానే కనిపించాయి. కానీ ఈ సినిమాలో మెయిన్ హైలెట్ హీరోయిన్ డాన్స్. ఇక ఆ డాన్స్ ని ఎలా చూపిస్తుంది అన్నది చూడాలి..!!