సూపర్ స్టార్ మహేష్ కి.. పవన్ జీవితంలో మర్చిపోలేని హెల్ప్ చేశాడట?
ఇలాంటి సమయంలో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ గురించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా జీవితంలో మర్చిపోలేని ఒక సహాయాన్ని పవన్ కళ్యాణ్ మహేష్ బాబుకు చేశాడట. ఇక ఇది కాస్త హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇంతకీ ఏమైందంటే సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఎవర్గ్రీన్ సూపర్ హిట్ సినిమాలలో ఒకటిగా ఉంది పోకిరి సినిమా. 2006లో సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది అన్న విషయం తెలిసిందే. ఇక మాస్లో అటు మహేష్ బాబుకు తిరుగులేని ఇమేజ్ ని తెచ్చిపెట్టింది.
ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అంటూ మహేష్ బాబు చెప్పిన డైలాగ్ టాలీవుడ్ మొత్తాన్ని ఊపేసింది. అయితే ఈ సినిమా విషయంలోనే పవన్ కళ్యాణ్ ఇన్ డైరెక్ట్ గా మహేష్ బాబుకు సహాయం చేశారట. ముందుగా పూరి జగన్నాథ్ ఈ సినిమాను పవర్ స్టార్ తో తీయాలని కథ రాసుకున్నాడు. అంతకుముందే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బద్రి సూపర్ హిట్ అయింది. దీంతో పవన్ కూడా ఇష్టంగానే కథ విన్నాడు. కానీ కథ ఎందుకో పవన్ కు కనెక్ట్ కాలేదు. చివరికి నో చెప్పేసాడు. ఇలా పవన్ కళ్యాణ్ నో చెప్పడంతో ఆ కథ మహేష్ దగ్గరికి వెళ్ళగా.. ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఇలా అనుకోకుండానే మహేష్ బాబుకు జీవితంలో మర్చిపోలేని హెల్ప్ చేశాడట పవన్ కళ్యాణ్.