తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈయన ప్రస్తుతం వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ ... మీటర్ అనే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో వినరో భాగ్యము విష్ణు కథ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోగా ... మీటర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ప్రస్తుతం ఈ యువ నటుడు రూల్స్ రంజన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీని ఇప్పటి వరకు ఈ మూవీ మేకర్స్ ప్రకటించలేదు. ఈ మూవీ ని సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ యొక్క ఓవర్ సీస్ హక్కులను చరిస్మా డ్రీమ్ ఎంటర్టైన్మెంట్ మరియు శ్లోక ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి వాటిలో ఎన్నో మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు గల దర్శకుడుగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈయన పేద కాపు అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను మరికొన్ని రోజుల్లోనే థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ యొక్క ఓవర్ సీస్ హక్కులను ఇప్పటికే ఈ సినిమా బృందం అమ్మి వేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ యొక్క ఓవర్ సీస్ హక్కులను చరిష్మా డ్రీమ్ ఎంటర్టైన్మెంట్ ... శ్లోక ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా దక్కించుకున్నట్లు సమాచారం.