ఖుషి సినిమా వచ్చేది ఆ ఓటీటీ లోనే.. ఎప్పుడంటే..!?

Anilkumar
విజయ్ దేవరకొండ మరియు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరో హీరోయిన్లుగా నటించిన సరికొత్త సినిమా ఖుషి. రొమాంటిక్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ఈరోజు థియేటర్స్లోకి వచ్చేసింది.ఇక తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక దీన్ని నమ్మలేం కాబట్టి జన్యున్ రివ్యూ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే ఇక ఇదంతా పక్కన పెడితే ఖుషి సినిమా విడుదలై మంచి టాక్ తో దూసుకుపోవడంతో ఈ సినిమా వస్తుంది అన్న విషయం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.


కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మరియు సమంత విప్లవ్ మరియు ఆరాధ్య అనే పేర్లతో కనిపిస్తారు. ఇక వీరిద్దరు కూడా లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు. తమ విషయం పెద్దలకు చెబితే పెళ్లి చేస్తే వీరిద్దరికీ సెట్ అవ్వదు అని కలిసి ఉండడం కష్టమని చెబుతారు. దీంతో ఇంటి నుండి బయటకు వచ్చేసి పెళ్లి చేసుకుని ఒక్కటవుతారు ఈ జంట వివాహ బంధంలోకి మొదట బాగానే ఉన్నప్పటికీ దాని తరువాత చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి. చివరికి ఏమైంది విప్లవ్ ఆరాధ్య ఒకటయ్యారా లేదా విడిపోయారా అన్నది తెలియాలంటే


సినిమా చూడక తప్పదు. ఇదిలా ఉంటే ఇక శివా నిర్వణ దర్శకత్వంలో రొమాంటిక్ అండ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఖుషి సినిమా డిజిటల్ రైట్స్ కోసం పలు సంస్థలు చాలా పోటీ పడినట్లుగా తెలుస్తోంది. కానీ ఆఖరికి భారీ ధరకు నెట్ఫ్లిక్స్ ఖుషి మూవీ ఓటిటి హక్కులని సొంతం చేసుకుంది అన్న వార్తలు వినబడుతున్నాయి .అయితే ఈ ఓటిటి లెక్క ప్రకారం కొత్త సినిమాలు దాదాపు నెల తర్వాత స్ట్రీమింగ్ అవుతూ ఉండడం మనం చూసాం. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 1న థియేటర్స్లోకి వచ్చింది. కాబట్టి అక్టోబర్ మొదటి వారంలో ఓటీటిలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి .దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: