అలాంటి డ్రెస్ లో మరింత అందంగా కనబడిన బాలీవుడ్ హాట్ బ్యూటీ...!!
రనౌత్ ఈ చిత్రం లో టైటిల్ పాత్ర పోషిస్తుంది.
ఈ చిత్రాన్నిఅగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీత అందిస్తున్నారు..అలాగే ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.ఈ సినిమాను వినాయక చవితి కానుకగా విడుదల కానుంది.అలాగే పాన్ ఇండియా స్థాయి లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ను కూడా జోరుగా నిర్వహిస్తున్నారు.అయితే ఈరోజు చెన్నైలోని జిప్పియర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చంద్రముఖి2 ఆడియో లాంఛ్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు చిత్ర యూనిట్ హాజరైంది. ఈ సందర్భంగా కంగనా రనౌత్ బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది.హెవీ ఎంబ్రాయిడింగ్ కలిగిన లెహంగా, వోణీలో మెరిసింది. ట్రెడిషనల్ వేర్ లో కంగనా రనౌత్ మరింత అందంగా కనిపించింది.. పైగా ఆకర్షణీయమైన జ్యూవెల్లరీ ధరించడం తో ఈ భామ లుక్ అదిరిపోయింది.ఈవెంట్ లో అందరి చూపు తనపైనే.. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట బాగా వైరల్ గా మారాయి.