తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది నటిమనులు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. వారిలో కొంత మంది మాత్రమే నటించిన మొదటి మూవీ తోనే విజయాలను అందుకొని అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంటు వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటారు. ఇకపోతే మరి కొంత మంది నటించిన మొదటి మూవీ పెద్దగా విజయం సాధించకపోయినప్పటికీ మొదటి మూవీ లో తమ అందంతో ప్రేక్షకులను కట్టిపడేసి వరుస అవకాశాలను దక్కించుకుంటూ ఉంటారు.
అలాంటి వారిలో సాక్షి వైద్య ఒకరు. ఈనటి అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ అనే మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలోకి రంగ ప్రవేశం చేసింది. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ ను అందుకుంది. ఈ మూవీ అపజయం సాధించినప్పటికీ ఈ సినిమాలో ఈ నటి తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సాక్షి కి అదిరిపోయే రేంజ్ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటి ఏజెంట్ మూవీ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన గాండీవదారి అర్జున సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తాజాగా థియేటర్ లలో విడుదల అయింది.
ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ కి మరో క్రేజీ సినిమాలో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో ఈ నటిని సెకండ్ హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఈ మూవీ మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాలో శ్రీ లీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... హరీష్ శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.