రామ్ చరణ్ తో తీయబోయే సినిమా కోసం అన్ని సంవత్సరాలుగా కష్టపడుతున్నాను... బుచ్చిబాబు..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే అదిరిపోయే రేంజ్ సక్సెస్ ను అందుకున్న వారిలో బుచ్చిబాబు సనా ఒకరు. ఈయన ఉప్పెన అనే మూవీ తో దర్శకుడుగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. అలాగే భారీ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా నటించగా ... కృతి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఓ కీలకమైన పాత్రలో నటించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.


ఇకపోతే తాజాగా ఈ మూవీ కి నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ చరణ్ కెరియర్ లో 16 వ మోవీ గా రూపొందబోతుంది. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూ.లో పాల్గొన్న బుచ్చిబాబు తాను చరణ్ తో చేయబోయే సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు ... తాజా ఇంటర్వ్యూ లో భాగంగా బుచ్చిబాబు మాట్లాడుతూ నేను చరణ్ తో చేయబోయే సినిమా కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టాను.


ఆ కథ నా ఫేవరెట్. దాని కోసం నేను నాలుగు సంవత్సరాలుగా పని చేస్తున్నాను. ఆ సినిమా కచ్చితంగా బ్లాక్ బాస్టర్ సినిమా అవుతోంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో కానీ వచ్చే సంవత్సరం జనవరి నెలలో కానీ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: