"ఖుషి" 5వ సాంగ్ విడుదల తేదీని అనౌన్స్ చేసిన మూవీ మేకర్స్..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికే తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ తాజాగా ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటించగా ... శివా నిర్వాణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ సినిమాకు వాశిం అబ్దుల్ వహీబ్ సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాని సెప్టెంబర్ 1 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ మూవీ ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.
 


ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ... రన్ టైమ్  ను కూడా లాక్ చేసింది. అలాగే ఈ మూవీ నుండి ఇప్పటికే నాలుగు పాటలను ... అనేక ప్రచార చిత్రాలను కూడా విడుదల చేసింది. వీటికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా లోని ఐదవ సాంగ్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ మూవీ లోని ఐదవ సాంగ్ అయినటు వంటి "ఓసీ పెళ్లామా" అంటూ సాగే సాంగ్ ను ఆగస్టు 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ మేకర్స్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఖుషి మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: