కరణ్ జోహార్ మాటలు.. నన్ను ఎంతో భయపెడుతున్నాయి : కంగనా

praveen
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఇక హిందీలో స్టార్ హీరోయిన్గా హవా నడిపించిన కంగానా  అటు ఇతర భాషల్లో కూడా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోయిన్లు ఉన్నా కంగనా మాత్రం వన్ అండ్ ఓన్లీ పీస్ అనే రేంజ్ లో ఇక ఎప్పుడు సినిమాలను చేస్తూ ఉంటుంది అని చెప్పాలి. కేవలం హీరోల సరసన రొమాంటిక్ పాత్రల్లో నటించడమే కాదు.. ఇక లేడి ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తూ  సూపర్ హిట్లను సాధించింది కంగనా.


 అయితే బాలీవుడ్ లో ఎవరైనా డైరెక్టర్ లేడీ ఓరియంటెడ్ కథను రాసుకున్నాడు అంటే చాలు అందరికీ మొదటి ఆప్షన్ కంగనా  అన్నట్లుగా ప్రస్తుతం తన నటనతో ఈ హీరోయిన్ ప్రభావితం చేసింది అని చెప్పాలి. అయితే ఇక సినిమాలతో ఎంతలా గుర్తింపును సంపాదించుకుందో.. వివాదాలతో, వివాదాస్పద వ్యాఖ్యలతో కూడా కంగనా అదే రీతిలో ఇక వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ అంటే కంగనకు అస్సలు గిట్టదు. ఇక ఎప్పుడూ అతనిపై ఏదో ఒక విధంగా విమర్శలు చేస్తూనే ఉంటుంది.


 ఈ క్రమంలోనే ఇటీవలే కంగనా దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ను ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. కరన్ జోహార్ చేసిన వ్యాఖ్యల వల్ల తాను భయపడుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్. ఎమర్జెన్సీ సినిమా చూసేందుకు తాను ఎదురుచూస్తున్నానని ఇటీవల కరణ్ జోహార్ కామెంట్ చేశాడు. అయితే గతంలోనూ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన మణికర్ణిక సినిమా విషయంలో ఇలాంటి కామెంట్ చేయగా.. ఇక కరణ్ జోహార్ కామెంట్ చేసిన కొన్ని రోజులకే నెగిటివ్ క్యాంపెయిన్ మొదలైంది అని కంగాన గుర్తు చేశారు. కాగా దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమానే ఈ ఎమర్జెన్సీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: