పూజ కార్యక్రమాలతోనే ఆగిపోయిన మెగాస్టార్ సినిమాల లిస్ట్ ఇదే....!!
ఇక ఆ తర్వాత చిరంజీవి పాన్ ఇండియా లెవె ల్లో ఆబు బాగ్దాగ్ గజదొంగ అనే సినిమా అని అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఈ చిత్రాన్ని ఇండియా లో ఉండే అన్ని భాషలలో విడుదల చేయాలనుకున్నారు డైరెక్టర్ సురేష్ కృష్ణ.. అయితే బడ్జెట్ ఎక్కువ అవ్వడం చేత ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయిందట.ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం లో ఒక సినిమా అనౌన్స్మెంట్ చేయగా అది కూడా ఆగిపోయింది. ఆ తర్వాత చిరంజీవి హీరో గా రామ్ రెడ్డి దర్శకత్వం లో వజ్రాల దొంగ సినిమా అని అనౌన్స్మెంట్ చేశారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో పూజా కార్యక్రమం కూడా జరగగా కొన్ని కారణాల చేత ఆగిపోవడం జరిగింది.చిరంజీవి 150వ సినిమా ను డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాని అనుకోగా ఎందుకో వర్కౌట్ కాలేదు. ఆర్జీవి దర్శకత్వం లో వినాలని ఉంది సినిమాని టైటిల్ అనౌన్స్ చేసి కొన్ని కారణాల చేత మధ్య లోనే నిలిపివేయడం జరిగింది.