బాలకృష్ణ లాస్ట్ 5 మూవీలకు వరల్డ్ వైడ్ గా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ ఆఖరుగా నటించిన ఐదు మూవీ లకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు తెలుసుకుందాం.

బాలకృష్ణ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా వీర సింహా రెడ్డి మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 73 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శృతి హాసన్ బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. హనీ రోజ్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించగా ... వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ఈ మూవీ లో విలన్ పాత్రలలో నటించారు. ఈ మూవీ ని మైత్రి మూవీ బ్యానర్ పై నవీన్ యేర్నేని , వై రవి శంకర్ నిర్మించారు.

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 54 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

బాలకృష్ణ హీరోగా రూపొందిన రూలర్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

కొంత కాలం క్రితం బాలకృష్ణ ఎన్టీఆర్ మహానాయకుడు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాను ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకు భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగి ఆ సినిమాకు భారీ నష్టాలు రావడంతో ఈ సినిమాను ఆ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే డిస్ట్రిబ్యూటర్ లకు విచ్చేసినట్లు తెలుస్తోంది.

ఇకపోతే బాలకృష్ణ హీరోగా రూపొందిన ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ కి 70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని ఎదుర్కొంది.

ఇకపోతే బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19 వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: