విడాకులు తీసుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్.. షాకవుతున్న ఫ్యాన్స్?

praveen
ఇటీవల కాలంలో బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లినవారు ఏకంగా హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినీ సెలబ్రిటీలుగా గుర్తింపును సంపాదించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక సినిమాల్లో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇలా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వారి గురించి అన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు తెగ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఏదైనా పర్సనల్ విషయం బయటకు వచ్చిందంటే చాలు అదే సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి.

 ఇక ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ కిరిక్ కార్తి తన వివాహ బంధానికి ముగింపు పలికారు. తన భార్య ఆర్పితతో విడాకులు తీసుకుంటున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. పాత జ్ఞాపకాలను మరిచిపోయి త్వరలోనే కొత్త జీవితం ప్రారంభించబోతున్నట్లు ఒక పోస్ట్ పెట్టారు. అయితే వీరికి 11 ఏళ్ల క్రితం పెళ్లి కాగా.. ఇటీవల వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు రూమర్స్ తెరమీదికి వచ్చాయి  కానీ ఇద్దరూ ఎక్కడ దీనిపై స్పందించలేదు. కానీ ప్రస్తుతం ఈ వార్తలు నిజమే అన్న విషయం కిరిక్ కార్తి పోస్టుతో అందరికీ అర్థమైంది.

 ఈరోజు చట్టం ప్రకారం మేము విడిపోయాం.. అర్పిత నాకు మధ్య బంధానికి పూర్తిగా తెరపడింది. ఇకనుంచి నా వ్యక్తిగత విషయాలతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. ఉండదు కూడా. అధికారికంగా మేము విడాకులు తీసుకున్నాం. ఆమె కూడా మంచి జీవితాన్ని పొందాలని ఆశిస్తున్నాను. చేదు జ్ఞాపకాలను మర్చిపోయి మీ ప్రేమ శుభాకాంక్షలు భవిష్యత్తులోనూ ఉండాలని కోరుకుంటున్నా అంటూ కిరిక్ కార్తీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అయితే 2023లో డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు కిరిక్ కార్తి. కాగా ఈ సెలబ్రిటీ జంట విడాకులు మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: