చిన్న సినిమాలను చంపేయకండి.. యూట్యూబ్ రివ్యూలపై సోహెల్ ఆగ్రహం?
ఇలా వెండితెరపై అడుగు పెట్టాలని కలలుకని.. ఇక ఇటీవల హీరోగా పరిచయమై ప్రేక్షకులను పలకరించాడు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్. సోహెల్ గురించి కొత్తగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అంతకుముందు ఇక సీరియల్లో నటించడం ద్వారా కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాక ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది.
ఆడవాళ్లు పడే పురిటి నొప్పులు మగవాళ్ళకు వస్తే ఎలా ఉంటుంది అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు సోహెల్. అయితే ఈ సినిమాపై అటు యూట్యూబ్లో మాత్రం కొన్ని నెగటివ్ రివ్యూలు వస్తూ ఉండడం గమనార్హం. ఇదే విషయం గురించి స్పందించాడు సోహైల్. సినిమాలపై కొంతమంది పని కట్టుకొని మరి తప్పుడు సమీక్షలు ఇస్తూ ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చిన్న చిత్రాలకు ఇది ప్రాణ సంకటనగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేసిన సోహెల్.. తన చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్ తో పాటు 300 కోట్ల కు పైగా వసూలు సాధించిన రజనీకాంత్ జైలర్ సినిమా పైన కూడా ఇలాంటి తప్పుడు సమీక్షలు కల్పించారు అంటూ కామెంట్ చేసాడు. ఈ విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ఏమాత్రం మంచిది కాదు అంటూ వ్యాఖ్యానించాడు.