ఆ కారణంగా యూపి గవర్నర్ ను కలిసిన సూపర్ స్టార్ రజనీకాంత్...!!

murali krishna
జైలర్ చిత్ర విడుదల కు ఒకరోజు ముందు రజినీ కాంత్ ఉత్తరాఖండ్ వెళ్లారు. ఆధ్యాత్మిక పర్యటన లో భాగంగా ఆయన పుణ్యక్షేత్రాలు, ఆశ్రమాలు సందరిస్తున్నారు. ఆదివారం ఆయన అయోధ్య ను సందర్శించ నున్నారు.ఇందు కోసం ఉత్తరప్రదేశ్ చేరుకున్నారు. నేడు ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆమె తో కొంత సేపు ముచ్చటించారు. గవర్నర్ ఆనందీ బెన్ పటేల్-రజనీ కాంత్ భేటీ కి సంబంధించిన ఫోటోలు యూపీ గవర్నర్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. అవి వైరల్ అవుతున్నాయి.యూపీ రాజధాని లక్నోలో జైలర్ మూవీ స్క్రీనింగ్ జరగనుంది. నిన్న రాంచీ లో ఉన్న రజినీ కాంత్ ప్రసిద్ధ చిన్న మస్తా ఆలయాన్ని సందర్శించారు. అనంతరం రాంచీ లోని యగోదా ఆశ్రమం లో గంట సేపు ధ్యానం చేశారు. జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ తో సమావేశమయ్యారు. అయోధ్య పర్యటన అనంతరం రజినీ కాంత్ చెన్నై తిరిగి రానున్నారని సమాచారం.

మరోవైపు జైలర్ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయ విహారం చేస్తుంది. జైలర్ వసూళ్లు వరల్డ్ వైడ్ రూ. 470 కోట్ల ను అధిగమించాయి. ఐదు వందల కోట్ల మార్క్ దిశ గా అడుగులు వేస్తుంది. తెలుగు రాష్ట్రా ల్లో జైలర్ భారీ ఆదరణ దక్కించుకుంది. ఏపీ/తెలంగాణ లలో రూ. 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన జైలర్ రూ. 34.5 కోట్ల షేర్, రూ. 59 కోట్ల గ్రాస్ రాబట్టింది.జైలర్ చిత్రాని కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మించారు. తమన్నా, రమ్యకృష్ణ, సునీల్ కీలక రోల్స్ చేశారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ చేశారు. చాలా కాలం తర్వాత రజినీ కాంత్ తన స్థాయి విజయం సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: