తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ ఈ సంవత్సరం ప్రారంభంలో వారిసు మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళ వెర్షన్ ఈ సంవత్సరం జనవరి 11 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయింది. ఆ తర్వాత ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ జనవరి 14 వ తేదీన విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా తెలుగు లో వారసుడు పేరుతో విడుదల అయింది. ఈ మూవీ కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... యోగి బాబు , ప్రకాష్ రాజ్ , శ్రీకాంత్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.
ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ మ్యూజిక్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ సినిమా తమిళ వెర్షన్ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని భారీ మొత్తంలో కలక్షన్ లను వసూలు చేయగా ... ఈ సినిమా తెలుగు వర్షన్ యావరేజ్ విజయాన్ని అందుకొని యావరేజ్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఆ తర్వాత ఈ మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి "ఓ టి టి" ప్రేక్షకులను కూడా అద్భుతమైన రీతిలో అలరించింది. ఇకపోతే ఈ సినిమా యొక్క "ఓ ఎస్ టి" ఒరిజినల్ సౌండ్ ట్రాక్ కోసం ఎంతో మంది విజయ్ అభిమానులు మరియు మామూలు సంగీత ప్రేమికులు కూడా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ యొక్క "ఒరిజినల్ సౌండ్ ట్రాక్" ను విడుదల చేసినట్లు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.