బాక్సాఫీస్ వద్ద జైలర్ సినిమా కలెక్షన్స్ సునామీ కొనసాగుతుంది. చాలా కాలం తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ తన మార్క్ సరైన సినిమా పడితే ఏ స్థాయి వసూళ్లు సాధిస్తాడో ఆయన నిరూపించాడు.కేవలం ఏడు రోజుల్లో జైలర్ మూవీ ఏకంగా రూ. 450 కోట్లు కొల్లగొట్టింది. వరల్డ్ వైడ్ జైలర్ సూపర్ గా సత్తా చాటుతుంది. తమిళనాడు, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా జైలర్ వసూళ్లు తగ్గు ముఖం పట్టిన దాఖలాలు లేవు. ఇప్పటికే కమల్ హాసన్ విక్రమ్ సినిమా రికార్డును జైలర్ అధిగమించింది. విక్రమ్ లైఫ్ టైం రూ. 410 కోట్ల వసూళ్లు రాబట్టింది. కేవలం ఆరు రోజుల్లో జైలర్ ఏకంగా రూ. 416 కోట్లు జైలర్ రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో జైలర్ మూవీ భారీ లాభాలు పంచుతుంది.ఇప్పటికే ఏకంగా రూ. 53 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. నైజాంలో రూ. 15 కోట్ల షేర్ అందుకుంది. జైలర్ మూవీ తెలుగు హక్కలు చాల తక్కువ ధరకు దిల్ రాజు సొంతం చేసుకున్నారు.
ఇప్పుడు ఆయనకు జైలర్ బంగారు గనిలా దొరికింది.ఇక ఖచ్చితంగా ఈ వారం కూడా జైలర్ దే. తెలుగు, తమిళ భాషల్లో చెప్పుకోదగ్గ సినిమాల విడుదల కూడా లేదు. భోళా శంకర్ సినిమా కూడా పూర్తిగా చేతులెత్తేసింది. దీంతో జైలర్ మూవీకి ఎదురులేకుండా పోయింది. నెక్స్ట్ జైలర్ పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా రికార్డు పై కన్నేసింది. ఆ మూవీ ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టగా జైలర్ మరో రెండు రోజుల్లో ఆ ఫీట్ చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. జైలర్ చిత్రానికి బీస్ట్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. రజినీకాంత్ రిటైర్డ్ జైలర్ రోల్ చేశారు. మోహన్ లాల్ ఇంకా శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ తో అదరగొట్టారు. అలాగే రమ్యకృష్ణ, తమన్నా, సునీల్ కీలక రోల్స్ చేశారు. జైలర్ సినిమాకి అనిరుధ్ సంగీతం ఆయువు పట్టులా నిలిచింది. సన్ పిక్చర్స్ జైలర్ మూవీని తెరక్కించారు.ఖచ్చితంగా ఇంకో రెండు మూడు రోజుల్లో ఈ మూవీ 500 కోట్లు రాబట్టడం పక్కా..