మహేష్ బాబు-చిరంజీవి కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న చిరంజీవి గురించి ప్రతీకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. సినిమాలు చేయడమే కాకుండా బ్యాక్ టు బ్యాక్ హిట్ లని కూడా తన ఖాతాలో వేసుకుంటున్న చిరంజీవి. తాజాగా నటించిన 'భోళాశంకర్' సినిమాతో డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోవడంలో విఫలమైంది. ఒరిజినల్ కథ కాకపోవడం ఆల్రెడీ రీమేక్ సినిమా కావడం ఈ సినిమాకి పెద్ద మైనస్ గా మారాయి. 


దాంతో ఈ సినిమా ఫ్లాప్ అని తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు చాలామంది. అయితే ఈ నేపథ్యంలోని మెగాస్టార్ చిరంజీవి మరియు మహిష్ బాబు కాంబినేషన్ లో రావలసిన సినిమా ఒకటి మిస్ అయింది అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి మరియు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సింది. కానీ ఆ సినిమా కొన్ని కారణాలవల్ల రాలేదు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు స్థానంలో మాస్ మహారాజా రవితేజ నటించిన జరిగింది. ఇక ఆ సినిమా మరి ఏదో కాదు వాల్తేరు వీరయ్య. 


బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అయింది. 
మెగాస్టార్ చిరంజీవి మరియు రవితేజ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో రవితేజ పాత్ర కోసం ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబుని కలిసారట డైరెక్టర్ బాబీ. కానీ కథానుసారం ఈ సినిమా మాస్ గా ఉండడం తో తన బాడీలాంగ్వేజ్కి సెట్ అవ్వదు అన్న ఉద్దేశంతో మహేష్ బాబు ఈ సినిమా రిజెక్ట్ చేశారట. దాంతో అలా మెగాస్టార్ చిరంజీవి మరియు రవితేజ కాంబినేషన్ సెట్ అయింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: