స్కంద సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్..!!
అఖండ వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 15న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ , సాంగ్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శ్రీ లీల, రామ్ స్టెప్పులు మాత్రం అదిరిపోయేలా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఆఫ్ లైన్ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మరొక రెండు కొత్త పోస్టర్లను సరిత చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. రెండు పోస్టర్ల ద్వారా ఈ సినిమాలో ఎలాంటి కంటెంట్ ఉండబోతుందని విషయం తెలియజేసినట్లు తెలుస్తోంది.
లవ్ అండ్ యాక్షన్ అదిరిపోయే రెండు కూడా ఈ సినిమాలో కలిపి ఉన్నట్లు కనిపిస్తోంది ఒక పిక్ లో రామ్ పవర్ఫుల్ యాక్షన్ సీరియస్ లుక్ లో విలన్లను చిత్తకొడుతూ కనిపిస్తూ ఉన్నారు. మరొక పోస్టర్లు రామ్ శ్రీ లీల తో చిలిపి సరసలాడుతున్నట్టుగా నవ్వుతూ ఉన్న పోస్టర్ని రిలీజ్ చేశారు ఇటు ఫ్యామిలీ ఆడియస్ ను కూడా బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. మొత్తంగా ఈ రెండు పోస్టర్ల ద్వారా అటు మాస్ ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మెప్పించే విధంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ గా ఈ పోస్టర్తో మరింత హైప్ ని పెంచేశారు చిత్ర బృందం.