అభిమాని పై దయ చూపిన తమన్నా !
లేటెస్ట్ గా చిరంజీవి పక్కన ‘భోళాశంకర్’ మూవీలో ఆమె హీరోయిన్ గా నటించింది. ఈమధ్య ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె వెళ్ళినప్పుడు ఆమెకు ఆమె వీరాభిమాని నుండి ఆమెకు ఒక సంఘటన ఎదురైంది. ఆ షాపింగ్ మాల్ మెట్లు ఎక్కుతున్న సందర్భయంలో ఆమె చుట్టూ ఉన్న బోనసర్స్ ను అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బందిని తప్పించుకుని ఒక అభిమాని వెనక నుంచి వచ్చి తమన్నా చేయి పట్టుకున్నాడట.
ఈ అనుకోని సంఘటనకు తమన్నా షాక్ అయినట్లు తెలుస్తోంది. తమన్నా చుట్టూ ఉన్న బౌన్సర్లు ఆ యువకుడుని కొట్టడానికి ప్రయత్నిస్తే తమన్నా అలా చేయవద్దని చెప్పి అయోమయంతో ఉన్న ఆ యువకుడుని తన వద్దకు పిలిపించుకుని మాట్లాడిందట. అతడు తన వీరాభిమాని అని తెలుసుకుని ఇలాంటి సాహసం ఎందుకు చేశావు అని అడితే అతడు తమన్నా తో సెల్ఫీ కోసం బ్యారికెట్స్ దూకి వచ్చానని చెప్పినప్పుడు ఆమె షాక్ అయి అతడితో సెల్ఫీ తీసుకోవడమే కాకుండా బ్యారికెట్స్ దాటడంతో ఆయువకుడుకి రక్తం వస్తున్న విషయాన్ని గమనించి అతడిని హాస్పటల్ కు తీసుకు వెళ్ళి అతడికి వైద్యం చేయించమని తన డబ్బు కూడ ఇవ్వడంతో తమన్నా చూపించిన అభిమానానికి ఆ ఫంక్షన్ కు వచ్చిన చాలమంది ప్రశంసలు కురిపించినట్లు టాక్.
ప్రస్తుతం ఇండస్ట్రీలో తమన్నా క్రేజ్ ఏమాత్రం లేదు. దీనితో ‘భోళాశంకర్’ మూవీ విజయం ఆమె కేయర్ కు అత్యంత కీలకంగా మారిన నేపధ్యంలో ఈమూవీ ఫలితం గురించి ఆమె ఆశక్తిగా ఎదురు చూస్తోంది..