ఇటీవల చాలా చిన్న సినిమాగా విడుదలై
బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బేబీ
సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాయి రాజేష్ దర్శకత్వంలో వైష్ణవి
చైతన్య హీరోయిన్గా
ఆనంద్ దేవరకొండ మరియు విరాజ్ అశ్విన్ లు హీరోలుగా వచ్చిన ఈ
సినిమా విడుదలై ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకున్నాయి. అయితే ఈ
సినిమా విడుదల కాకముందే ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. దాంతో మొదటి షో నుండి ఈ
సినిమా సక్సెస్ టాక్ తో దూసుకుపోయింది. అలా ప్రారంభమైన ఈ
సినిమా యాత్ర ఇప్పటివరకు దిగ్విజయంగా కొనసాగుతోంది.
అయితే ఈ సినిమాలో మెయిన్ హీరోగా నటించిన ఆనంది ఆనంద
దేవరకొండ విజయ్
దేవరకొండ కి తమ్ముడు అన్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఇక్కడ రెండవ హీరోగా నటించిన విరాజ్ అశ్విన్ గురించి మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు. దీంతో ఈయనకి సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్
మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే విరాజ్
అశ్విని ఎవరో కాదు
టాలీవుడ్ లో ప్రముఖ సీనియర్ మోస్ట్ ఎడిటర్ మార్తాండ్ కె
వెంకటేష్ కి మేనల్లుడు అవుతారట. మార్తాండకి
వెంకటేష్ దశాబ్దాల నుండి సినీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్ గా పనిచేశారు.
ఇటీవల
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా
శంకర్ సినిమాకి కూడా ఆయన ఎడిటర్. అయితే ఇటీవల విరాజ్
అశ్విని పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ నూతన కుటుంబానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. తమది అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని తన
తండ్రి ఇస్రోలో శాస్త్రవేత్తగా కూడా పనిచేశాడు అని.. ఇలా ఎవరికీ తెలియని కొన్ని విషయాలను ఈ సందర్భంగా బయటపెట్టాడు విరాజ్ అశ్విన్ .అయితే విరాజ్ అశ్విన్ కి సినిమాలో కాకపోతే ఏ రంగంలో ఆయన రాణించే సత్తా ఉంది అని.. కానీ సినిమాలు అంటే చిన్నపటి నుండి చాలా ఇష్టం అని.. అందుకే సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాను అని ఇన్ని రోజులకు సరైన
బ్లాక్ బస్టర్ విజయం నాకు అందింది అని ఈ సందర్భంగా తనకి సంబంధించిన విషయాలను బయటపెట్టాడు. దీంతో విరాజ్ అశ్విన్ కి సంబంధించిన ఈ వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి..!!